Pithapuram : పిఠాపురంలో స్టిక్కర్ల వార్.. తగ్గని పొలిటికల్ హీట్

Pithapuram

Pithapuram

Pithapuram : ఏపీలో ఎన్నికలు ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం ఏ కొంచెం కూడా తగ్గలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పవన్ అభిమానులు బైకులు, ఆటోలు, కార్లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అనే కొటేషన్స్ తో స్టిక్కర్లు వేస్తున్నారు.

అటు జనసేనకు ధీటుగా వైసీపీ అభ్యర్థి వంగా గీత అభిమానులు కూడా స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. కాబోయే డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ బైకులపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే పిఠాపురంలో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ స్టిక్కర్లతో హంగామా సృష్టిస్తున్నారు.

పిఠాపురంలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో ఉండగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు. అయితే వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రచారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంతో అక్కడి ఫలితం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

TAGS