Siddhu Jonnalagadda : మరో ప్రాజెక్టుకు సిద్దూ గ్రీన్ సిగ్నల్.. పవన్ కళ్యాణ్ దర్శకుడితో సినిమా..
Siddhu Jonnalagadda : డీజే టిల్లు, టిల్లూ స్క్వేర్ రెండు సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేసిన సిద్దూ జొన్నలగడ్డ ఈ ఊపును ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నారట. అందుకే ఏ ప్రాజెక్ట్ వచ్చినా.. ఏ డైరెక్టర్ ఏ కథ చెప్పినా ఒకే అనడం లేదట. టిల్లూ స్క్వేర్ పై ఫుల్ ఫోకస్ పెట్టి సక్సెస్ కొట్టిన సిద్దూ అది పూర్తయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాలను ఓకే చేశాడు. అయితే ఇవి ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
ఈ రెండింటితో పాటు చాలా ప్రాజెక్టులు వచ్చాయట. వాటన్నింటిలో ఒక సినిమాకు మాత్రమే ఓకే చేసినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ తో ‘తొలి ప్రేమ’ తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి ఫస్ట్ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. గతేడాది ‘సార్’ చేసి మెప్పించాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ చేస్తున్నాడు. ఇటీవలే ఒక కథతో ఆయన సిద్దూ వద్దకు చేరుకోగానే.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘లక్కీ భాస్కర్’ పూర్తవగానే ఈ సినిమా ప్రారంభిస్తాడట. ఈలోగా ‘తెలుసు కదా’; ‘జాక్’ లను సిద్దూ కొలిక్కి తీసుకురానున్నాడు.
సిద్దూ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చేసిన బ్యానర్ సితార సంస్థకే ఈ వెంకీ సినిమా చేయనున్నాడట. ఇక డైరెక్టర్ వెంకీకి రంగ్ దే, సార్ చిత్రాలు కూడా ఇదే బ్యానర్ లో వచ్చాయి. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ కూడా సితార సంస్థకే చేస్తున్నాడు. ఇద్దరికీ మంచి అనుబంధం ఉన్న సంస్థలోనే సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట సిద్ధు, డైరెక్టర్ వెంకీ అట్టూరి.