YCP : పైకే ప్రగాల్భాలు..లోలోపల వణికిపోతున్న వైసీపీ నేతలు

YCP

YCP

YCP : వైసీపీ పాలనలో ఇబ్బంది పడని ఏ ఒక్క వర్గమూ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రజలే నానా కష్టాలు పడ్డారంటే ఇంకా ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి చాలా దారుణం. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఈ వర్గం వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని అసలే కోరుకోదు. దానికి నిదర్శనమా అన్నట్టుగా ఈసారి సుమారు 5 లక్షలకు పైగా నమోదయ్యాయి. గతంలో పోస్టల్ బ్యాలట్స్ ద్వారా లక్షన్నర ఓట్లు నమోదు కావడం గమనార్హం. అయితే ఈ అనూహ్యంగా ఈ ఓట్లు అత్యధికంగా నమోదు కావడంతో వైసీపీ ఆందోళన మొదలైంది. ఎందుకంటే అవన్నీ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులవే కనుక. వారందరూ జగన్‌ ప్రభుత్వ బాధితులే కాబట్టి ఆ పార్టీ భయపడుతోందని చెప్పవచ్చు.

పోస్టల్ బ్యాలెట్ వేసిన వారిలో మెజారిటీ శాతం టీడీపీ కూటమికే వేసి ఉంటారనడంలో సందేహమే అవసరం లేదు. కనుక కౌంటింగ్‌ సమయంలో వాటిలో వీలైనన్ని ఎక్కువ ఏదో వంకతో పక్కన పెట్టించేందుకు వైసీపీ తప్పకుండా ప్రయత్నించవచ్చు. కానీ జగన్‌ ప్రభుత్వానికి ఈసీ ఈ విషయంలో మరో  షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, వాటిని పక్కన పెట్టకుండా లెక్కించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పోస్టల్ బ్యాలట్ ఓట్లలో రిటర్నింగ్ ఆఫీసర్ లేదా మరో అధికారి సంతకం పెట్టడం మరిచిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈసారి అలా జరిగినా ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయని ఈసీ చెప్పడం వైసీపీకి మరో ఎదురుదెబ్బే అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్  చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, టీడీపీ సీనియర్ నేతలు, అలాగే పవన్‌ కళ్యాణ్‌, ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ఫలితాల గురించి మాట్లాడలేదు. అందరూ 120 కంటే ఎక్కువ సీట్లు సాధించి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారే తప్ప అతిగా మాట్లాడటం లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బుద్ధా వెంకన్న వంటి కొందరు టీడీపీ నేతలు మాత్రం తమ ప్రెస్ మీట్ల ద్వారా వైసీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు.

అయితే కూటమి నేతల వ్యూహాత్మక మౌనంతో వైసీపీ  నేతలని మరింత భయపెడుతున్నట్లే ఉంది. అందుకే ‘జగన్‌ అనే నేను… విశాఖలో ప్రమాణస్వీకారం…’ దాని కోసం విశాఖలో హోటల్స్ అన్నీ అప్పుడే బుకింగ్ అయిపోయాయని, రాష్ట్రం నలుమూలల నుంచి జూన్ 8,9 తేదీలలో విశాఖ వెళ్లే బస్సులలో టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే వారు గొప్పలకు పోతున్న లోలోపల భయంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రమాణస్వీకారం గురించి మాట్లాడుతూనే ఈసీ, పోలీస్ అధికారులు అందరూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారని వాపోతున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని ప్రగాల్భాలు పలికిన వైసీపీకి గెలుపు భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 4న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించే అవకాశాలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా గట్టి బందోబస్తు నిర్వహించేందుకు ఈసీ రెడీ అవుతోంది.

TAGS