India and Pakistan : ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్

India and Pakistan

India and Pakistan

India and Pakistan : ఐపీఎల్ ముగిసింది. జూన్ 2 నుంచి టీ 20 క్రికెట్ ప్రపంచకప్ జరగబోతుంది. ఇందులో 20 జట్లు పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపుల్లో అయిదు టీంలను విడదీసి మ్యాచులు ఆడించనున్నారు. ఇండియా గ్రూపులో కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్ఏ ఉన్నాయి. ఇందులో టాప్ 2 ప్లేస్ లో నిలిచిన జట్టు టాప్ 8 కు అర్హత సాధిస్తుంది.

ఎప్పటి లాగానే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అనగానే మ్యాచ్ టికెట్ల కోసం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. ఈ టికెట్ల కోసం గతేడాది నుంచే తీవ్ర పోటీ నెలకొంది. అది అమెరికాలో కావడంతో అక్కడ ఉన్న భారతీయులు, పాకిస్థాన్ దేశానికి చెందిన వారు, వ్యాపార వేత్తలు, క్రికెట్ అభిమానులు పోటీపడి మరీ టికెట్లను బ్లాక్ లో కొనేందుకు ట్రై చేస్తున్నారు.

అమెరికాలో మొదటి సారి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుండటంతో టికెట్లకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. టికెట్ కన్పర్మ్ చేసుకునే సమయంలో ప్రీమియమ్ సెక్షన్ అని కొన్ని స్టాండ్ లను చూపిస్తోంది. అందులో టికెట్లు కన్పర్మ్ చేస్తే ప్రీమియమ్ అది కూడా లిమిటెడ్ టికెట్స్ ఆఫర్స్ అని కనిపిస్తోంది.  మరో ప్రాంతంలో అన్ ఇంటరాప్టెడ్ వివ్ అని చూపిస్తుంది. ఇలా టికెట్లను కొన్ని కొన్ని విడుదల చేస్తూ అమ్ముతున్నారు.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ గత టీ 20 సీజన్ లో ఆస్ట్రేలియా లో జరిగింది. మెల్ బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో విరాట్ కొహ్లి అద్భుతమైన ఇన్సింగ్స్ తో పాకిస్థాన్ పై మ్యాచ్ ను గెలిపించాడు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఓటమి అంచుల నుంచి విరాట్ వీరోచితంగా పోరాడి గెలిపించిన మ్యాచ్ ను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేకపోతున్నారు. అమెరికాలో కూడా లూసియా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతుండగా.. ఎలాగైనా సరే మ్యాచ్ ను చూడాలని దీని కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడడం లేదు.

TAGS