Telangana BJP : బీజేపీని కట్టడి చేయాల్సిందే

Telangana BJP

Telangana BJP and Congress

Telangana BJP : తెలంగాణ రాష్ట్రంలో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకొంది. ఇది ఒకవైపు గులాబీ శ్రేణులకు మింగుడు పడడంలేదు. మరోవైపు బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కుప్పకూలిపోయింది అనే పద్దతిలో జోస్యంచెబుతున్నారు. పట్టుమని మాది నెలలు కూడా కాకముందే ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలనే ద్యేయంగా పెట్టుకున్నాయి. ఆగష్టు లోపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేతలు మాటలు, ఆరోపణలు, గుసగుసలు చూస్తుంటే రాష్ట్రంలోని అధికార పార్టీకి కూడా ఎక్కడో అనుమానం తలెత్తింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే కాషాయం పార్టీ ని కట్టడి చేయాల్సిందేననే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి, అతని మంత్రి వర్గం, వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యకరమైన వాతావరణము కొనసాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి నిధులు కొరత ఉండదు. కేంద్రంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలకు కూడా మంత్రివర్గంలో బెర్త్ దొరుకుతుంది. అది రాష్ట్రానికి అదనపు బలాన్ని చేకూరుస్తుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. అప్పుడు గులాబీ శ్రేణులతో పాటు, కమలం నాయికలను కూడా కట్టడి చేయడనికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గంకు రాష్ట్రంలో అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. రాష్ట్రం నుంచి కూడా కేంద్ర మంత్రి వర్గంలో వాటా వస్తుంది. రాష్ట్ర  అభివృద్ధికి నిధుల మంజూరులో ఇక్కట్లు తప్పవు. నిధులు ఇవ్వకుండానే కాషాయం నేతలు సీఎం అభివృద్ధిలో విఫలం అయ్యారంటూ విమర్శలకు పదును పెడుతారు.

కాబట్టి బీజేపీ శ్రేణులకు పరిపాలన పరంగా అవకాశం ఇవ్వకుండా ఎత్తుకు పై ఎత్తులు వేయాలని రేవంత్ రెడ్డి మంత్రి వర్గం ఆలోచనలో పడింది. అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను, తాజాగా రాబోయే ఎంపీ లను కట్టడి చేయడనికి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే రాజకీయ ఎత్తుగడలకు సిద్ధమైనట్టు సమాచారం.

TAGS