Mata Karunamayi : పంచగ్రహ కూటమి..ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..మాత కరుణామయి సూచన
Mata Karunamayi : భారత సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో మనల్ని అగ్రభాగాన నిలబెడుతోంది. భారతీయ ఆధ్యాత్మికత గొప్పతనాన్ని ఎంతోమంది ప్రవచనకారులు, యోగులు, గురువులు..వారి ప్రసంగాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. అలాంటివారిలో కరుణామయి ఒకరు. నవగ్రహల గురించి ఆమె అద్భుత ప్రసంగం ద్వారా తెలుసుకుందాం. ఆమె ప్రసంగంలో ఏం చెప్పారంటే..
ఆకాశంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కో సమయంలో ఒక్కో గ్రహ స్థితి కాంబినేషన్ ఆకాశంలో ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని కాంబినేషన్ల వల్ల ప్రకృతి విపత్తులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని రాశుల వారికి లాభం కొన్ని రాశుల వారికి నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది పంచ గ్రహ కూటమి ఏర్పడబోతోంది. అంటే ఐదు గ్రహాలు ఒకేసారి ఆకాశంలో దర్శనమిస్తాయి.
కుజుడు, శుక్రుడు, గురువు, బుధుడు, సూర్య గ్రహం కలిసి ఒకేసారి కనిపించబోతున్నాయి. ఇది 13 ఏళ్ల తర్వాత ఏర్పడబోతున్న కూటమి. ఈ పంచ గ్రహ కూటమి అనేది మనకు జూన్ 2 నుంచి జూన్ 14 వరకు కనిపిస్తుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఆకాశంలో తూర్పు వైపున చూస్తే కనిపిస్తాయి. అరుదైన గ్రహకూటమి జూన్ నెలలో 5,6 తేదీల్లో ఆవిష్కృతం కానుంది. ఈ గ్రహ కూటమిని పంచగ్రహ కూటమి అని కూడా అంటారు. జూన్ 5వ తేదీ ఉదయం 10:37 నిమిషాలకు శుక్రుడు..అదే రోజు మధ్యాహ్నం 02:22 చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఇప్పటికే ఈ రాశిలో కుజ ,బుధ, శని గ్రహాలు ఉన్నాయి. కొత్తగా శుక్ర, చంద్ర గ్రహాలు సైతం మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడనుంది.
పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే అలాంటి రాశుల వారు సూచించిన గ్రహశాంతులు జరుపుకుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. జన్మకుండలిలోని జాతక దోషాలు ఉన్నవారు గ్రహ శాంతి చేయించుకోవాలి.
కర్కాటక రాశి:
ఈ రాశి వారు వ్యాపార విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. దీంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది. కుటుంబ కలహాల నుంచి బయటపడాలంటే సామరస్యంగా మాట్లాడడం ఉత్తమం. అంతేకాకుండా శివుడి ఆరాధన వీరికి కలిసి వస్తుంది.
మిథున రాశి:
పంచగ్రహ కూటమి వల్ల ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది. నమ్ముకున్న వారి చేతిలోనే వీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అవివాహితులు సామరస్యంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కన్య రాశి:
ధనం విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే వీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం గడిపేవారు కూడా జాగ్రత్తలు పాటించడం అవసరం. అపోహల వల్ల కుటుంబ కలహాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. నవగ్రహాల్లో కుజుడికి ఎర్రటి పూలను సమర్పించాలి. హనుమంతుడికి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.