Bunny : బన్నీ ఒక్క విజిట్ తో నలుగురు పోలీసులకు వీఆర్..

Bunny

Bunny

Bunny :బన్నీ (అల్లు అర్జున్) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సౌత్ నుంచి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన మొదటి సౌత్ హీరో ఆయనే. అయితే ఆయన ఆ మధ్య చేసిన ఒక చర్య పొలిటికల్ గా ఏపీని హీటెక్కిస్తోంది. ఆయన ఆ చర్యతో నలుగు పోలీస్ అధికారులకు ఎలక్షన్ కమిషన్ వీఆర్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటే?

పోలింగ్ రెండు రోజులు ఉన్నాయనంగ ఏపీలో అతిపెద్ద ర్యాలీ, రోడ్ షో నిర్వహించాన తన ఫ్రెండ్ వైసీపీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేసేందుకు ఏపీకి వెళ్లాడు. చాలా మంది జనాలు ఆయన రోడ్ షోకు వచ్చారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అంత మంది జనాలను ఎలా అనుమతించారని ఈసీ మొదట ఎస్పీని, స్థానిక ఎన్నికల అధికారిని ప్రశ్నించింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన విపరీతంగా చర్చనీయాంశమైంది. ప‌రిణామాలు అంత‌టితో ఆగ‌కుండా పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఉలిక్కిపడేలా చేశాయి.

తాజా అప్‌డేట్ ప్రకారం.. అల్లు అర్జున్ నంధ్యాల పర్యటనపై పోలీస్ శాఖ నలుగురు అధికారులను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉంచింది. ఇద్దరు కానిస్టేబుళ్లు, 1-టౌన్ నంధ్య ఎస్‌బీ కానిస్టేబుల్ నాయక్, తాలూకా ఎస్‌బీ కానిస్టేబుల్ నాగరాజు తో పాటు అందరినీ డిపార్ట్‌మెంట్ వీఆర్‌లో పంపింది. అంటే, తదుపరి నోటీసు వచ్చేవరకు వాటిని బెంచ్‌లో ఉంచుతారు.

ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, అనుమతి లేకుండా ఇంత భారీ బహిరంగ సభ జరిపేంత వరకు పోలీస్ శాఖకు గానీ, స్థానిక ఎన్నికల అధికారికి గానీ ఎందుకు  తెలియదు. అది కూడా ఎన్నికల ప్రచారం ముగియడానికి ఒక్కరోజు ముందు మాత్రమే. బన్నీ నంద్యాల టూర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా ఫ్లోలో ఉన్నాయి. సంబంధిత అధికారులందరూ ఇప్పుడు వీఆర్ లో ఉన్నారు.

TAGS