Love Me If You Dare Review : లవ్ మి ఇఫ్ యూ డేర్ రివ్యూ, యూఎస్ ప్రీమియర్ రిపోర్ట్
రిలీజ్ డేట్ : మే 24 (శుక్రవారం)
డైరెక్టర్ : అరున్ భీమవరపు
సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరామ్
మ్యూజిక్ : ఎంఎం కీరవాణి
ప్రొడ్యూసర్ : హర్షితా రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లాది
ప్రొడక్షన్ : దిల్ రాజు
Love Me If You Dare Review : విజువల్ పరంగా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా, క్యారెక్టర్ డెవలప్ మెంట్ లో కాన్ఫిడెన్స్, కన్విన్సింగ్ ఈ రెండు కథాంశంలో లోపించాయి. అర్జున్ గా ఆశిష్ తెరపై బాగానే కనిపించాడు, తన పాత్రకు అన్ని విధాలా న్యాయం చేయగలిగాడు.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్..
‘లవ్ మీ’ ఫస్ట్ హాఫ్ లో లవ్ యాంగిల్ కన్విన్సింగ్ గా అనిపించదు. ఆడ దెయ్యం చుట్టూ కొంత సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతం, పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం సినిమాను విజువల్ గా ఆకట్టుకునేలా ఉన్నాయి. సెకండాఫ్ చివర్లో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. ‘లవ్ మి’ (ఇఫ్ యూ డేర్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో దెయ్యం వీరి మధ్యలోకి వస్తుంది.
‘ఇఫ్ యూ డేర్’ అనే సరికొత్త ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న లవ్ మూవీ ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన మొదటిది. దీంతో ఎన్నికల వేళ బిజీగా గడిపిన సినీ అభిమానులు ఎన్నికలు ముగియడంలో సినిమాకు క్యూ కట్టారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పని చేవారు. మరి థియేటర్లలో వినోదాన్ని కోరుకునే విమర్శకులను, ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందో లేదో చూడాలి.