BRS Social Media : BRS సోషల్ మీడియా లో ఉందామా, వెళదామా ???

BRS Social Media

BRS Social Media

BRS Social Media : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పరిపాలనతో భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఆడింది ఆట, పడింది పాట అయ్యింది. తిరుగులేదని నాయకులు, కార్యకర్తలు భావించారు. కానీ ఊహించని పరాజయం మూటగట్టుకుంది బిఆర్ఎస్. ఒక్కసారిగా రాజభోగం కోల్పోయే సరికి గులాబీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బిఆర్ఎస్ శ్రేణులు లక్ష్యంగా చేసుకొని నిత్యం విమర్శలతో పొద్దు గడుపుతున్నారు.

బిఆర్ఎస్ ప్రథమ శ్రేణి నాయకులను నమ్ముకొని సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తప్పుడు సమాచారం షేర్ చేశారు. నిజాన్ని అబద్దంగా ప్రచారం చేయడానికి ప్రయత్నించారు.. నిద్ర లేచింది మొదలుకొని, నిద్ర పోయేంతవరకు కాంగ్రెస్ మీద సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారు గులాబీ నాయకులను నమ్ముకొని తప్పుడు ప్రచారం చేసినందుకు బిఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ కటకటాల పాలయ్యారు. పార్టీని నమ్ముకున్న సోషల్ మీడియా ఇంచార్జిలు పదుల సంఖ్యలో  పోలీస్ స్టేషన్, కోర్ట్ ల చుట్టూ తిరుగక తప్పడంలేదు. అధికారం కోల్పోయింది. ఒకవైపు అధికారం లేక పోవడం, మరోవైపు కోర్ట్ ల చుట్టూ తిరగడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇన్ని రోజులు వాడుకున్న నాయకులు ఇప్పుడు కార్యకర్తలు ఎదుటపడితే ముఖం చాటేస్తున్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాజాగా టీజీ తొలగించి దాని స్థానంలో టీఎస్ ఆమోదం తెలిపింది ప్రభుత్వం. దానిపై తప్పుడు ప్రచారం చేయడంతో సోషల్ మీడియా ఇంచార్జి లు సాయంత్రం అయ్యేసరికి పోలీస్ స్టేషన్ లో కూర్చోవలసిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇంత జరుగుతున్న కనీసం ఓడిపోయిన, గెలిచిన నాయకులు అండగా నిలబడటంలేదని పలువురు సోషల్ మీడియా భాద్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రజలు నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి కనబడుతలేదు. ఈ నేపథ్యంలో ఉండటం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి. పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోయింది.
భవిష్యత్తు దెబ్బతింటోంది. పదేళ్లు రాజకీయ నాయకుల చుట్టూ తిరగడానికే సమయం సరిపోయింది. అధికారం పోయింది. ఆర్థికంగా నిలబడాలంటే సొంతగా ఉపాధి లేదు. ఇప్పటికయినా మించి పోయింది లేదు అంటూ గులాబీ సోషల్ మీడియా శ్రేణులు పార్టీకి దూరం కావడానికే నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.

TAGS