Prashant Kishor : ఎన్నికల అంచనాలపై ప్రశాంత్ కిషోర్ అబద్ధాలు! పైగా సీనియర్ జర్నలిస్ట్ తో వార్..

Prashant Kishore

Prashant Kishor-Karan Thapar

Prashant Kishor : రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అంచనాలు వేస్తుంటాడు. పీకే ‘జన్ సూరజ్’ మిషన్ బిహార్ ప్రజల నుంచి ఎటువంటి మద్దతును పొందలేకపోయింది. గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో, కేంద్రంలో పార్టీలకు విజయాలు సాధించి పెట్టిన ప్రశాంత్ కిషోర్ తనను తాను ‘మిస్టర్ నో ఆల్’ అని భావిస్తాడు. అతను ఎన్నికల ఫలితాలపై ఖచ్చితమైన అంచనా వేయగలడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీకి భారీ నష్టం జరుగుతుందని పీకే జోస్యం చెప్పారు. తాను సంఖ్యలను అంచనా వేయలేనని చెప్తూనే.. 151 నుంచి 51 స్థానాలకు తగ్గే అవకాశం ఉందన్నారు. సరే, ఎవరిని ఎక్కించాలో, ఎవరిని దించాలో ప్రజలే నిర్ణయిస్తారు కానీ, ప్రశాంత్ కిషోర్ అంచనాలకు అనుగుణంగా ప్రజల తీర్పు ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అతను చెప్పిందే జరిగవచ్చు. మరికొన్ని సార్లు జరగకపోవచ్చు. కానీ, పీకే తన అంచనాలపై చాలా నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తాడు. తన తీర్పును ప్రశ్నించే వారిపై విషం చిమ్మేందుకు కూడా వెనుకాడడు.


డిజిటల్ న్యూస్ పోర్టల్, ఛానెల్ ‘ది వైర్’ కోసం ప్రఖ్యాత టెలివిజన్ న్యూస్ యాంకర్, విశ్లేషకుడు కరణ్ థాపర్‌తో తాజా ఇంటర్వ్యూలో ఇదే జరిగింది. 2024లో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడంపై పీకే అంచనాలను ప్రశ్నిస్తూ, హిమాచల్ ప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, తెలంగాణలో బీఆర్ఎస్ విజయాన్ని అంచనా వేసే తన సొంత ట్వీట్‌పై కరణ్ థాపర్ ప్రశ్నించారు.

థాపర్ ప్రశ్నతో పీకేకు కాలింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమిని తాను ఊహించలేదని అన్న పీకే ‘నా స్టేట్‌మెంట్‌కి సంబంధించిన వీడియోను నాకు చూపించు. నేను క్షమాపణలు చెబుతాను, లేదంటే మీరు బహిరంగంగా క్షమాపణలు చెప్పండి’ అని నిలదీశారు.

కరణ్ థాపర్ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ క్లిప్‌, అతని ప్రకటనకు సంబంధించిన వార్తాపత్రిక నివేదికలను చూపించాడు. దీంతో పీకే పెద్దగా స్వరం పెంచి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కాదు వీడియో క్లిప్స్ చూపించాలని కోరాడు. సరే, ప్రశాంత్ కిషోర్ దానిని వీడియోలో చెప్పకపోయి ఉండవచ్చు, కానీ ప్రెస్ ఇంటరాక్షన్‌లో, దాన్ని అన్ని వార్తాపత్రికలు ప్రసారం చేశాయి. ఒక సమయంలో అన్ని వార్తాపత్రికల విశ్వసనీయతను ప్రశ్నించలేరు. అతని ట్వీట్ కూడా రికార్డులో ఉంది.

అయినప్పటికీ, అతను తను చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. తన సమాచారం ఆధారంగానే తాను అంచనా వేశానని, ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని చెబితే మరింత గౌరవంగా ఉండేది. దాంతో వివాదానికి తెరపడినట్టే! కరణ్ థాపర్‌పై ప్రశాంత్ విరుచుకుపడడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పీకే నిజం ఒప్పుకొని ఉంటే బాగుండేదని, దొరికిన తర్వాత కూడా అంతగా నిలదీయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

TAGS