Edu Fund : ఒక్కో బిడ్డపై రూ.75లక్షల ఖర్చు.. భరించలేక పిల్లలే వద్దనుకుంటున్న కొత్త దంపతులు

Edu Fund

Edu Fund

Edu Fund : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన భారత్‌.. చైనాను అధిగమించి మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. మన దేశంలో జనాభా పెరుగుదల రేటులో క్రమంగా క్షీణత కనిపిస్తోంది. ఆధునిక జీవన శైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా యువత సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. జనాభా పెరుగుదల రేటు పై దీని ప్రభావం పడినట్టు కొన్ని నివేదికలు ప్రకటించాయి. అయితే పెళ్లైన కొత్త జంటలు మునుపటిలా సంతానంపై ఆసక్తిని కనబరచడం లేదు. పెరుగుతున్న ఖర్చులే దీనికి ప్రధాన కారణమని తేల్చి చెప్పాయి.  

ఇది ఇలాగే కొనసాగితే దేశంలో పనిచేయగల శ్రామికశక్తి తగ్గిపోయి, వృద్ధుల జనాభా విపరీతంగా పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఉత్పాదకత తగ్గి దేశ ఆర్థికవ్యవస్థే కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందన్న భయాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో జనాభా పెరుగుదల రేటులో క్షీణతకు గల కారణాలను నిపుణులు విశ్లేషించడం ప్రారంభించారు. నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మిగులుతున్న సంపాదన అంతంత మాత్రమే. దీంతో కొత్త జంటలు పిల్లలను కనే ఆలోచనలను వాయిదా వేయడం, లేదా అసలే వద్దనుకుంటున్నట్లు ‘మింట్‌’ ఓ నివేదికలో వెల్లడించింది.

కాన్పు దగ్గరినుంచి పిల్లలకు డైపర్లు, రోగాలు రాకుండా వ్యాక్సిన్లు, వైద్య ఖర్చులు, బట్టలు, స్కూలు, కాలేజీ ఫీజులు, ఇంట్లో భోజనం, వినోదం, ఇతరత్రా ఖర్చులు.. బిడ్డ డిగ్రీ పట్టా పొంది ఉద్యోగం సంపాదించేవరకూ ఒక్కో భారతీయుడు తన సంతానంపై కనీసంలో కనీసం దాదాపు రూ. 65 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నట్టు ఎడ్‌-ఫిన్‌టెక్‌ కంపెనీ ‘ఎడ్యూ ఫండ్‌’ తన నివేదికలో వెల్లడించింది. సగటున ఈ ఖర్చు సుమారు రూ. 75 లక్షలుగా అంచనా వేసింది. మెడిసిన్‌ వంటి కోర్సులను చదివితే రూ.95 లక్షలు, విదేశాల్లో చదివితే రూ.1.5 కోట్ల పైమాటేనని చెప్పింది.

TAGS