KTR : మరోసారి మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్.. కాన్వాయ్ నే అంబులెన్స్ గా మార్చి..
KTR : నేటి సమాజంలో ఆపదలో ఉన్న వ్యక్తిని పలుకరిస్తే ఎక్కడసాయం అడుగుతాడో అని ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంటారు. మనిషి ఓ పక్క పడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే సెల్పీలు తీసుకుని.. వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి సొసైటీకి ఏదో గొప్ప చేశామని ఫీలవుతుంటారు తప్ప.. వెంటనే స్పందించి.. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ సాయం ఓ ప్రాణాన్ని కాపాడుతుందన్న కనీస ఆలోచన కూడా చేయడం లేదు. దారిన పోయే వ్యవహారం మనకెందుకులే అంటూ పట్టించుకోవడం లేదు. కానీ తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలా అనుకులేదు.
తనలో దాగి ఉన్న మానవత్వాన్ని మరో సారి తట్టి లేపారు. ప్రమాద బాధితుడిని తన ఎస్కార్ట్ కారులో ఆసుపత్రికి తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి 55ఏళ్ల వ్యక్తి ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోయాడు. యాక్సిడెంట్‌కు జరిగింది చూసి కూడా చాలా మంది అతడ్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఆ సమయంలో అటుగా వస్తున్న కేటీఆర్.. తన కాన్వాయ్ ఆపి.. స్వయంగా అతడే కిందకు దిగి.. ప్రమాదానికి గురైన అంజయ్యను తన ఎస్కార్ట్ కారులో ఆసుపత్రికి తరలించే విధంగా చర్యలు తీసుకున్నాడు. అంజయ్యాను చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. సకాలంలో కేటీఆర్ స్పందించడంపై ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం కేటీఆర్ ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతం వైపు నుండి వెళ్తున్న కేటీఆర్.. యాక్సిడెంట్ జరిగిందని తెలిసి.. తన కాన్వాయ్ నిలిపి.. బాధితుడిని చూశారు. తన కాన్వాయ్ కారులో ఆసుపత్రి తరలించి మానవత్వం చాటుకున్నారు. పలకరించడమే పాపం అనుకుంటున్న రోజుల్లో.. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఓ ప్రమాద బాధితుడి కోసం తన విలువైన సమయాన్ని వెచ్చించాడు కేటీఆర్. అతడు చేసిన గొప్ప పనిని జనాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నెట్టింట్లో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.