Rahul Tripathi : రాహుల్ త్రిపాఠి పోరాడినా.. సన్ రైజర్స్ కు ఓటమి తప్పలేదు
Rahul Tripathi : రాహుల్ త్రిపాఠి పోరాడినా.. సన్ రైజర్స్ కు ఓటమి తప్పలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అహ్మదాబాద్ లో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. కోల్ కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా పవర్ ప్లే లో చెలరేగి బౌలింగ్ చేయడంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్, షెహబాజ్ లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు క్యూ కట్టారు.
వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి మాత్రం మెరుగైన బ్యాటింగ్ తో సన్ రైజర్స్ పోటీలో నిలిచింది. ఓ వైపు వికెట్లు పడుతున్న రాహుల్ త్రిపాఠి సూపర్బ్ బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రాహుల్ త్రిపాఠికి తోడుగా నిలిచిన క్లాసెన్ కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. దీంతో 11 ఓవర్లలోనే సన్ రైజర్స్ వంద పరుగులు స్కోరు దాటించారు.
క్లాసెన్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టబోయి ఔట్ కాగా.. అబ్దుల్ సమద్ బ్యాటింగ్ కు దిగాడు. సమద్ రెండు సిక్సులు బాదినా.. అప్పటికే 55 పరుగులు చేసి ఊపు మీద ఉన్న రాహుల్ త్రిపాఠిని రనౌట్ చేయించాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో సమద్ కట్ షాట్ ఆడగా.. అండ్రీ రస్సెల్ మెరుపు ఫీల్డింగ్ తో ఆ బాల్ ను ఫోర్ వెళ్లకుండ ఆపాడు. దీంతో పాటు వెంటనే వికెట్ కీపర్ కు త్రో వేయగా.. రాహుల్ త్రిపాఠి తన వికెట్ ను త్యాగం చేయాల్సి వచ్చింది.
దీంతో నిరాశగా వెనుదిరిగిన రాహుల్ త్రిపాఠి డ్రెస్సింగ్ రూంకు వెళ్లే దారిలో మెట్లపై కూర్చొని ఆవేదన చెందాడు. మిగతా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్న వేళ రాహుల్ అద్బుత ఇన్సింగ్స్ ఆడావు. కాబట్టి నీవు గ్రేట్ భయ్యా అంటూ సన్ రైజర్స్ అభిమానులు రాహుల్ త్రిపాఠిని ఓదార్చుతున్నారు. ఇంకో చాన్స్ ఉందిలే చూసుకుందాం అంటూ ధైర్యం చెబుతున్నారు.