AP News : ఏపీలో కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు నిషేధం

AP News

AP News

AP News : ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన హింస, అలర్ల కారణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఇప్పటికే ఆయా జిల్లాల ఎస్పీల స్థానంలో కొత్త ఎస్పీలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్ అమ్మకంపై నిషేధం విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ తెలిపింది.

జూన్ 4వ తేదీ వరకు వాహనాల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపాలని, ఎట్టి పరిస్థితిలోను బాటిల్లు, కంటైనర్లలో నింపకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన పెట్రోల్ బంక్ లపై కఠిన చర్యలు తప్పవని, లైసెన్సులు రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపించింది.

TAGS