AP Govt To Supreme Court : చంద్రబాబుకు బెయిల్ వద్దు.. సుప్రీం కోర్టుకు ఏపీ సర్కారు..
AP Govt To Supreme Court : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని ఏపీ సర్కారు తప్పుబట్టింది. చంద్రబాబుకు బెయిల్ అంశంలో హైకోర్టు వ్యవహారశైలిపై సుప్రీం కోర్టు కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు మరికాసేపట్లో సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయనున్నట్లు తెలుస్తున్నది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో విచారణ జరుగుతున్నదని, ట్రయల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న అంశాన్ని హైకోర్టు నిర్ధారిస్తూ బెయిల్ ఇవ్వడంపై సీఐడీ తరఫు న్యాయవాదులు తప్పుబడుతున్నారు. టీడీపీ బ్యాంకు ఖాతాలు ఇవ్వలేదని, టీడీపీ నుంచి ఎవరూ రాలేదని చెప్పినా, టీడీపీ ఖాతాలోకి డబ్బు చేరిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సీఐడీ తరపు న్యాయవాదులు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని సీఐడీ తరఫున న్యాయవాదులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సీఎల్పీ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. అయితే ఈ పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే స్కిల్ కేసులో హైకోర్టు తన పరిధి దాటలేదని చంద్రబాబు తరఫున లాయర్లు చెబుతున్నారు. కేసు పూర్వపరాలు, ఇరు వర్గాల లాయర్ల వాదనలు విన్న తర్వాతే న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్నే సుప్రీం కోర్టు ఏకీభవించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం వేసే సీఎల్పీపై మాత్రం టీడీపీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.