Miral Movie Review : మిరల్ మూవీ భయపెట్టిందా..?

Miral Movie Review

Miral Movie Review

Miral Movie Review : ఈ సమ్మర్ లో పెద్ద పెద్ద సినిమాలు రావడానికే భయపడి పోతుంటే డబ్బింగ్ మూవీ అయినా మిరల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ నటించిన ఈ చిత్రం హరర్ సస్పెన్స్ జోనర్ లో వచ్చింది. అయితే భరత్ ప్రేమిస్తే తర్వాత అనేక సినిమాలు చేశాడు. కానీ ప్రేమిస్తే అంతా పేరు తెచ్చిపెట్టలేదు.

ఈ సినిమా కథాంశానికి వస్తే భరత్ (హరి) రమ( వాణి భోజన్ ) ఇద్దరు ప్రేమించుకుంటారు. అనంతరం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోగా ఒక బాబు జన్మిస్తాడు. అయితే అప్పటి నుంచి రమ కు ఏదో పీడకలలు రావడం మానసికంగా ఏదో జరిగిపోయినట్లు బాధపడుతుంది.  మరో వైపు భరత్ పనిచేసే కంపెనీ వద్ద యాక్సిడెంట్ కావడం, అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అత్తాగారింటి నుంచి వచ్చిన ఫోన్ లో ఇద్దరికి ఏదో దోషం ఉంది. కులదైవాన్ని నమ్ముకోవాలని చెబుతారు.

ఊరెళ్లి తిరుగు ప్రయాణమైన భరత్, రమలకు ట్రైన్ లో ఓ ముసుగు రూపంలో వచ్చిన అదృశ్య శక్తి ఇద్దరిపై దాడి చేస్తుంది. ఈ ముసుగు ఏంటీ? ఈ రూపం ఎవరిది? అనేది సినిమాలో  నే చూడాలి. అయితే డైరెక్టర్ శక్తివేల్ మాత్రం హరర్ మూవీని ఇలా కూడా తీయొచ్చా అనే విధంగా తీసి చూపించాడు. దెయ్యాలు, ప్రేతాత్మల సీన్స్ ఎక్కువగా పాడుబడ్డ బంగ్లాల్లోనే చూపిస్తారు. కానీ డైరెక్టర్ కొత్తగా చూపించాలని ప్రయత్నం చేశాడు.

ఇంటర్వెల్ వరకు పెద్దగా ఆసక్తి కనబర్చని సీన్లు ఉన్నాయి. ఇంటర్వెల్ సమయంలో కథలోకి వెళ్లడంతో ప్రేక్షకులు ఏం జరుగుతుందోనని కాస్త ఆలోచించేలా చేశారు. సెకండ్ హాప్ లో ఎక్కువగా చీకటి లో తీసి ప్రేక్షకులను భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే దెయ్యం చుట్టూ జరిగే సీన్లు కాస్త ఇంట్రస్ట్ తెప్పిస్తాయి. కానీ ఏ సినిమాకైనా ట్విస్టులు ఇంపార్టెంట్.. అయితే ఈ ట్విస్టులు ఇవ్వడంలో ప్రేక్షకుల మనుసును దోచాలి. కొంతవరకు వరుసగా వచ్చిన ట్విస్టులు మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు బలం చేకూర్చింది.

TAGS