PM Modi : పాక్ వద్ద అణ్వాస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు: పీఎం మోదీ
PM Modi : పాకిస్థాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని చెబుతోన్న కాంగ్రెస్, వాటి నిర్వహణకు ఆ దేశం వద్ద డబ్బు లేదన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదని పీఎం మోదీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో కేవలం 50 సీట్లే గెలవడాన్ని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్, ఫతేపుర్ లలో నిర్వహించిన ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. తొలి నాలుగు విడతల పోలింగ్ లో ‘ఇండియా’ కూటమికి చుక్కెదురవడంతో నిరాశలో కూరుకుపోయిన కార్యకర్తలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య అనేక పోలికలు ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కుటుంబ పాలనను ప్రోత్సహిస్తాయన్నారు. ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు దేనికైనా వెనుకాడవు. ఉగ్రవాదులు, మాఫియా, నేరగాళ్లకు సానుభూతి ప్రకటిస్తాయని, ఆర్టకల్-370ని తిరిగి తెస్తామని హస్తం పార్టీ చెబుతోందని మోదీ ఆరోపించారు. హమీర్, ఫతేపుర్ స్థానాలకు అయిదో విడతలో భాగంగా ఈనెల 20వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.