BRS : రైతన్న కోసం పోరుబాట పట్టిన గులాబీలు

BRS-Farmers

BRS-Farmers

BRS : కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. హామీల్లో ముక్యంగా రైతులను ఆకట్టుకోడనికి కూడా హామీలను ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. కాంగ్రెస్ నమ్మి ఓటేసిన రైతులను అధికారంలోకి వచ్చిన తరువాత నట్టేట ముంచిందని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపిస్తున్నారు. రైతులను ఆదుకోడానికి కార్యకర్తలు ముందుకు రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చే విదంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి బిఆర్ఎస్ నిర్ణయం తీసుకోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలు ప్రతి నియోజజవర్గం కేంద్రలో ఏర్పాటు చేశారు.

రైతు పండించిన వారి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ పైననే పోరాటం చేయడానికి కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులను నియోజక వర్గం కేంద్రాలకు రావాల్సిందిగా కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు భాద్యత తీసుకున్నారు. వీరితో పాటు తాజా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కూడా పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.  

పార్టీ అధికారం కోల్పోయాక గులాబీ శ్రేణుల్లో ప్రథమ శ్రేణి నాయకుల్లో పలువురు కండువా మార్చుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఓటమి చెందిన నాయకుల్లో ఎక్కువ మంది నాయకులు పార్టీ  మారారు. అటువంటి కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. నాయకుల వెంట, కార్యకర్తలు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం వరంగల్ లో కేటీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే పట్టుమని నలబై మంది కూడా రాలేదు. అందులో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా రాకపోవడంతో సమావేశం వెలవెలబోయింది.

రాజకీయ నిరుద్యోగం ఏర్పడిన వెంటనే పదేళ్లు రాజభోగం అనుభవించిన నాయకులు నియోజకవర్గాల నుంచి ఫిరాయించారు. నాయకత్వం లేని లోటు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే ప్రేమతో కేసీఆర్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఈమేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరువు కాపాడుకోవడానికి ఈ రైతు నిరసన కార్యక్రమం చేపట్టారనే అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

TAGS