Vani Ganapathy : కమల్ హాసన్ మాజీ భార్య వాణీ గణపతి ఫొటోలు వైరల్

Vani Ganapathy

Vani Ganapathy

Vani Ganapathy : కమల్ హాసన్ మాజీ భార్య వాణీ గణపతి భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. ఏడేళ్ల వయసులోనే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టిన ఆమె తన ప్రదర్శనల కోసం ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. బెంగళూరులో నివసిస్తున్న ఆమె సంచారి అనే డ్యాన్స్ అకాడమీని స్థాపించారు. వాణి 1978లో నటుడు కమల్ హాసన్ ను వివాహం చేసుకున్నారు. 1975లో వచ్చిన ‘మేల్నట్టు మరుమగళ్’ సినిమాలో ఆయనతో కలిసి నటించింది. పెళ్లి తర్వాత వాణి పలు సినిమాలకు కమల్ హాసన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. పదేళ్ల తర్వాత 1988లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా వాణీ గణపతి ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో, వాణి 73 సంవత్సరాల వయస్సులో కూడా ఫిట్ గా,  అందంగా కనిపిస్తుంది.

వైరల్ అవుతున్న ఫోటోలో వాణి గణపతి ఆరెంజ్ బోర్డర్ తో నలుపు రంగు పట్టు చీర కట్టుకుంది. దానికి సరిపోయే ఆరెంజ్ బ్లౌజ్ ధరించింది. ఈ ఫోటోలో ఆమె ఆడిటోరియంలో కూర్చొని ఉంది. బ్రౌన్ ఐషాడో, కోహ్లి రిమ్డ్ కళ్లు, న్యూడ్ లిప్‌స్టిక్ తో సహా గ్లామర్ మేకప్ ధరించింది. బరువైన నెక్లెస్ సెట్, దానికి సరిపోయే గాజులు, ఎర్రటి బొట్టుతో ఆమె తన లుక్ కనబర్చింది. ఆమె అందంగా కనిపించింది.

2015లో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన వాణీగణపతి తమిళ సూపర్ స్టార్ నుంచి విడాకులు తీసుకోవడంపై పెదవి విప్పలేదు. తాము విడాకులు తీసుకొని 28 సంవత్సరాలు గడిచాయని, ఇది ప్రైవేట్ వ్యవహారం కాబట్టి బురదజల్లడం మానేశానని వాణి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.  కమల్ హాసన్ నుంచి తను భారీగా భరణం పొందానని కామెంట్లను ఆమె తోసిపుచ్చింది. ‘భరణం, విడాకులు రెండూ కలిసి ఉంటాయి. కానీ నేను అతడిని దివాళా తీయించడం అవాస్తవం. ప్రపంచంలో ఏ కోర్టులో భరణం ఒకరిని దివాళా తీయాలని ఆర్డర్ చేయదు.

ఈ వార్త చదివినప్పుడు తాను పూర్తిగా షాక్ కు గురయ్యానని తెలిపారు. తాను పెళ్లి నుంచి నిష్క్రమించినప్పుడు అతని అహం దెబ్బతిని ఉండవచ్చునని, కానీ అప్పటి నుంచి చాలా విషయాలు జరిగాయని ఆమె అన్నారు.

వాణీ గణపతితో విడాకులు తీసుకున్న తర్వాత కమల్ హాసన్ నటి సారికతో డేటింగ్ ప్రారంభించారు. 1986లో వీరిద్దరికీ కూతురు శ్రుతిహాసన్ జన్మించింది. రెండేళ్ల తర్వాత 1988లో కమల్, సారిక వివాహం జరిగింది. ఈ జంటకు 1991 లో రెండవ కుమార్తె అక్షర జన్మించింది. కమల్ హాసన్, సారిక 2004లో విడిపోయారు.

TAGS