Spirit of Democracy : ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇదే నిదర్శనం..

Spirit of Democracy

Spirit of DemocracSpirit of Democracy : సరైన రోడ్లు, వాహనాలు, రవాణా సౌకర్యం ఉన్నా.. కొందరు ఓటు వేసేందుకు బద్ధకిస్తుంటారు. కానీ గిరిజనులు మాత్రం ఓటేసేందుకు ముందుకు వస్తారు. ఓటు వేస్తేనే తమ సమస్యలు తీరుతాయని, తాము బతికి ఉన్నట్లు ప్రభుత్వం కూడా నమ్ముతుందని, తమకు వచ్చే పథకాలు కూడా వస్తాయని వారు విపరీతంగా నమ్ముతారు. అందుకే ఓటు వేసేందుకు కొండలు, గుట్టలు దిగి వస్తారు.

గిరిజన ప్రాంతాల్లో జనాభా లెక్కల కోసం అధికారులు కొండలు, గుట్టలు ఎక్కి అక్కడి వారి పేర్లను నమోదు చేస్తారు. ఈ లెక్కింపుతో వారికి ఓటు హక్కును కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓటు హక్కు కోసం గిరిజనులు బయటకు వస్తుంటారు. రోడ్లు, వాహనాలున్నా  అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక గిరిజన గ్రామం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకెళ్లారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాకతీయులు జిల్లా వరంగల్ లోని వాణి నికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరుసగా నిల్చున్న వీరిని ఫొటోలు తీసిన కొందరు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో అప్ లోడ్ చేశారు. ఇక, ఏపీలో గల్లా జయదేశ్ తన కొడుకులు,  అశోక్, సిద్ధార్థ్ తో కలిసి ఓటు వేశారు. ఇలా ప్రముఖులు తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు.

ఎన్టీఆర్ జిల్లా.. ఏ కొండూరు(మ), కంభంపాడులోని పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న ఉదృక్త వాతావరణం నెలకొంది.ఎన్నికల సరళని పర్యవేక్షించడానికి కాన్వాయ్ తో కంభంపాడులోని పోలింగ్ కేంద్రాలకు  వెళ్ళిన కేశినేని చిన్ని.. తమను పంపకుండా టీడీపీవాళ్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంతో నిరసన తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన వైసిపి కార్యకర్తలు.. నినాదాలతో దద్దరిల్లిన వాతావరణం.. అక్కడ నుండి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ అభ్యర్థి చిన్ని.

TAGS