Barrelakka : నన్ను చెప్పుతో కొట్టండి అంటూ ఏడుస్తున్న బర్రెలక్క..

Barrelakka

Barrelakka

Barrelakka : సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష కూడా ఒకరు. ఎన్ని చదువులు చదివినా గవర్నమెంట్ ఉద్యోగాలు రావు.. బర్రెలు కాయడమే అనే వీడియోతో ఫేమస్ అయ్యింది శీరిష అలియాస్ బర్రెలక్క. ఆమె అసలు పేరుకన్నా బర్రెలక్కగానే పేరు సంపాదించుకుంది.  ఈ క్రమంలో గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా, కొల్లాపూర్ శాసనసభ నియోజవకర్గం నుంచి ఇండిపెండెంట్ గా  పోటీ చేసింది బర్రెలక్క అలియాస్ శిరీష. అయితే ఆ ఎన్నికల్లో  ఆమె మాత్రం విజయం సాధించలేకపోయింది. ఇటీవల పెళ్లి చేసుకున్న బర్రెలక్క పలు వీడియోలు పోస్ట్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నది.

ఇటీవల తాను ఎంపీ పదవికి పోటీ చేస్తానని ప్రకటించింది. నామినేషన్ వేసి ప్రచారంలో పాల్గొని వీడియోలను కూడా పంచుకుంది. అయితే పోలింగ్ కు మరో రోజు ముందు బర్రెలక్క వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తాను చనిపోతానేమోనని, భయంగా ఉందంటూ ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ నేను మరో గీతాంజలిలా బలి అవుతానేమోనని అనిపిస్తున్నది. మీరు మీ సంతోషం కోసం.. కంటెంట్ కోసం చేస్తున్న వీడియోల వల్ల ప్రాణాలు పోతున్నాయి. నేను నా కుటుంబం ఈ రోజు ఎంతో బాధపడుతున్నాము. నెగెటివ్ ట్రోల్స్ తో మానసికంగా వేధిస్తున్నారు. నెగిటివ్ గా  ట్రోల్స్ చేసి మెసేజ్ చేసి చాలా హింసిస్తున్నారు. ఇలా ట్రోల్ చేసే వారికి ఇది ఆనందం దొరుకుతుంది కావచ్చు.. కానీ ఎదుటి వాళ్ల జీవితం.

ఇలా చాలా మంది జీవితాలు నాశనమయ్యాయి. అందులో నేను కూడా ఉన్నాను .నేను చేసిన తప్పేంటో అర్థం కావట్లేదు. కానీ ఇలా ట్రోల్ చేయడం వల్ల  వల్ల నా కుటుంబం, నేను చాలా బాధపడుతున్నాం. అలాంటి వారిని తానెప్పుడు వదిలిపెట్టను. తనకు వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్న వారి మీద ఫిర్యాదు చేస్తున్నాను. ట్రోల్స్, బ్యాడ్ కామెంట్స్ నేను భరించలేక పోతున్నా. ఎంపీ ఎన్నికల్లో  నిలబడినందుకు కూడా నన్ను ఎంతో హింసిస్తున్నారు.. కామెంట్లతో నాకు నరకం చూపెడుతున్నారు..  నేను విసుగెత్తి పోయా. ఇవన్నీ చూస్తేంటే ఒక్కోసారి నేను చచ్చిపోతానేమో ఏమైనా చేస్కొని అని భయంగా ఉంది. ఇప్పుడే కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాను .భర్తతో ఉంటున్నాను .కానీ నన్ను సంతోషంగా బతకనివ్వడం లేదు. ట్రోలింగ్,  కామెంట్లతో నన్ను బాధిస్తున్నారు.

ఎన్నికలయ్యాక సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. రీల్స్ అన్ని తీసేసి భర్తతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ట్రోల్స్ చేసే అన్నలు, అక్కలు నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీ ఎడమ కాలు చెప్పు తీసుకుని కొట్టండి. కానీ నన్ను ట్రోల్ చేయకండి. వాటిని తట్టుకోలేకపోతున్న. ఇక పొలిటికల్ లైఫ్ కూడా ముగిస్తున్న. మంచి చేయడానికి వచ్చిన వాళ్లకు ఇక్కడ స్థానం లేదని నాకు కాస్త ఆలస్యంగా అర్థమైంది. అన్నింటికీ ముగింపు పలికి లైఫ్‌లో నేను సంతోషంగా ఉండాలనుకుంటున్న.. థాంక్స్’’ అంటూ బర్రెలక్క చెప్పుకొచ్చింది. ఈ వీడియో చేస్తున్నంత సేపు బోరున విలపించింది.  ఒక్కసారిగా వీడియో షేర్ చేయడంతో ఆమె ఫాలోవర్లు షాక్ అవుతున్నారు. కొందరు ఆమెకు సపోర్ట్‌గా  మెసేజ్ లు పెడుతున్నారు.

TAGS