Common Man Satires : ఐదేండ్ల జగన్ పాలనపై సామాన్యుడి సెటైర్స్ వింటే షాక్..వైరల్ వీడియో

Common Man Satires

Common Man Satires

Common Man Satires on Jagan : ఏపీలో ఎన్నికలు ప్రచారం మరో రెండు, మూడు గంటల్లో ముగియబోతోంది. పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారంలో చివరి రోజు కావడంతో బిజీబిజీగా ఉన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఒక్క క్షణం కూడా తీరికగా ఉండడం లేదు.  ఇలా ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ప్రజల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో సోషల్ మీడియా ప్రచారం మాత్రం హోరెత్తనుంది. ఇప్పటికే జగన్ పాలన తీరుపై వేలాది షార్ట్ వీడియోలు వచ్చాయి. వాటిని చూస్తున్న జనం నివ్వెరపోతున్నారు. జగన్ ఐదేండ్ల పాలనలో తమకు ఎంతో నష్టం జరిగిందని గ్రహిస్తున్నారు.

ఓ వీడియోలో జగన్ ఐదేండ్ల పాలనపై ఓ సామాన్యుడు చెప్పిన మాటలు, సెటైర్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. జగన్ ఐదేండ్ల పాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారని ఓ చానల్ వారు ప్రశ్నించగా..దానికి సామాన్యుడు ‘‘మూడు రాజధానులన్నారు.. ఒకటి లేదు.. అయినా మనకు రాజధానితో పనేముందిలెండి.. మన యాపారం ఎందో మనం చేసుకుంటాం.. మన పిల్లలు ఎలా పోతే మనకెందుకు?’’ అంటూ ఎద్దేవా చేశారు.

ఇక జాబ్ క్యాలెండర్ అన్నారు క్యాలెండర్ మాత్రమే కనిపిస్తోందని, చదువుకున్న యువత ఏ కొట్టుల్లోనో, కూలీలుగానో పనిచేస్తున్నారు. ఇసుక ధరలు చాలా తక్కువండీ..ఒక ట్రాక్టర్ ఇసుక ధర ఐదారు వేలు మాత్రమేనండి..ఇది చాలా తక్కువ కదండి..అంటూ సెటైర్ వేశారు. మద్య నిషేధం అన్నారండి..రేట్లు పెంచితే తాగేస్తారని చెప్పి రేట్లు పెంచారండి..ఈ పిచ్చి మందు తాగి నాకు తెలిసిన వారే ఐదుగురు చనిపోయారండి.. వలంటీర్ల వ్యవస్థ లేకుంటే ప్రభుత్వమే నడువదండి.

పవన్ కల్యాణ్ సిన్మా రిలీజైతే పోలీసులు, రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులు అక్కడే ఉంటారండి..ఏపీ వాళ్లు పేదవాళ్లు కదండి.. అందుకే టికెట్ ధరలు ఐదు, పది రూపాయలు చేశారండి..కానీ పింఛన్లు పెంచడానికి మాత్రం ఈ ఉద్యోగులు పనికి రారండి..ఇలా పలు అంశాలపై సామాన్యుడు సెటైరికల్ గా మాట్లాడుతూనే గత ఐదేండ్లలో జగన్ పాలనలో జరిగిన అన్యాయాన్ని కళ్లకుగట్టాడు. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీని చక్కదిద్దగలడని చెప్పుకొచ్చారు.

TAGS