Alcohol : మద్యం ప్రియులకు మళ్లీ షాక్..

Alcohol

Alcohol

Alcohol : ఓ వైపు జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతుండగా.. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండల్లో చల్లని బీర్‌తో ఎంజాయ్‌ చేయాలనుకునే మందు ప్రియులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు  మద్యం షాపులు, బార్ షాపులు మూతపడనున్నాయి.  దీంతో మద్యం ప్రియులపై పిడుగుపడినంత పనైయింది. మద్యం షాపులు మూసివేస్తున్నది ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం అమలు కానుంది.  

తెలంగాణలో మే 13న  లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఉంది.  దీంతో అధికారులు మద్యం షాపుల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.  ఎన్నికల వేళ మద్యం విపరీతంగా అమ్ముడవుతూ ఉంటుంది.  ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఎన్నికల కమిషన్ ఈ చర్యలు తీసుకున్నది. మే 13న పోలింగ్‌ జరగనుండగా  రెండు రోజుల ముందు నుంచే బంద్ పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలతోపాటు అన్ని కల్లు కంపౌండ్లు సైతం మూతపడనున్నాయి.

11వ తేదీ నుంచే..

మే 11న  శనివారం సాయంత్రం 6 నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్‌ షాపులు మూసివేయనున్నారు. తిరిగి మే 13న సాయంత్రం 6 గంటలకు మద్యం షాపులు యథావిధిగా తెరుస్తారు. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు గాను  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ఈ నిబంధనలను ఎవరైనా విస్మరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.  ఇదిలా ఉంటే.. ఓట్ల లెక్కింపు రోజున (జూన్ 4న) కూడా తిరిగి మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.

వరుసగా బంద్‌లు

మద్యం ప్రియులకు వరుస బంద్‌లు షాకిస్తున్నాయి. గత నెలలో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం షాపులు మూసి వేశారు. ఈ నెలలో వరుసగా రెండు రోజులు మూత పడనున్నాయి.  జూన్4న కౌంటింగ్ ఉండడంతో ఆ రోజు కూడా మూసివేయనున్నారు. ఇలా వరుస షాకులు తగులుతుండడంతో మద్యం ప్రియులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.  

బీర్‌లకు భారీ డిమాండ్‌ :

రాష్ట్రంలో ఈ సారి వేసవి పట్ట పగలే చూపిస్తున్నవి. ఎండలు మండుతున్నాయి. రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపు  40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో.. మందుబాబులు వైన్ షాపులు, బార్ షాపుల్లో చల్లని బీర్లతో సేద తీరుతున్నారు.  ఇప్పుడు అవి కూడా రెండు రోజుల పాటు అందుబాటులో ఉండడం లేదు. మంచిర్యాలలో ఓ వ్యక్తి 20 రోజుల నుంచి వైన్‌ షాపుల్లో లైట్‌ బీర్లు విక్రయించడం లేదని,  ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. మద్యం దుకాణాలు రెండు రోజుల పాటు మూత పడనుండడంతో మద్యం ప్రియులు ఊసూరుమంటున్నారు. 

TAGS