Chandrababu : సూపర్ సిక్స్ బాబుకు సక్సెస్ అయ్యేనా..???

Chandrababu

Chandrababu

Chandrababu : జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. జగన్ అవినీతి, అక్రమాలను ఎండగడుతూ విస్తృత ప్రచారం చేస్తోంది కూటమి. గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ అంటే సంక్షేమ పథకాలు, పథకాలు అంటే వైసీపీ అని వినబడేది. ఆ పథకాలకు దీటుగా కూటమి సూపర్ సిక్స్ పేరుతో మ్యానిఫెస్టో విడుదల చేసింది. జగన్ పథకాల కంటే గొప్ప పథకాలను సూపర్ సిక్స్ పేరుతో ఓటర్లను కూటమి ఆకట్టుకొంటోంది.

గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం పథకాలను ప్రజలకు దానం రూపంలో పంపిణి చేస్తూ పటిష్టమైన ఓటర్లను తాయారు చేసుకొంది. వైసీపీ నేతలకు అది ఏ మాత్రం కళ్లకు తప్పుగా కనబడలేదు. నేటికీ కూడా జగన్, ఆయన మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు అంత కూడా పథకాల గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటూ వైసీపీ నే గెలిపించాలని కోరడం విశేషం.

ప్రజల కోసం మేము సంక్షేమ పథకాలను అమలుచేస్తే ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అవే పార్టీలు పథకాల పేరుతో ఓటర్ల వద్దకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని వైసీపీ నేతలు కూటమి నేతలను ప్రశ్నిస్తున్నారు. కూటమి మ్యానిఫెస్ట్ లో ఉన్న పథకాలను అమలు చేయడానికి బడ్జెట్ మొత్తం కేటాయించిన సరిపోదని, వాటికీ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కూటమి ప్రకటించిన పథకాలు అమలు చేయడాని నిధులు సరిపోవనే విషయాన్నీ రాష్ట్రమంతా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ ప్రచారం కూటమికి కలిసివచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. వైసీపీ నేతలు ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పే అవకాశం జగన్ ప్రభుత్వమే కల్పించిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

నిధులు సరిపోవని కూటమిపై చెడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు చంద్రబాబు తనదయిన శైలిలో సమాధానం చెబుతున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాల్ని సమర్థవంతంగా అమలుచేస్తామని ఓటర్లకు స్పష్టం చేస్తున్నారు.ఇంత సూటిగా నిధులు, పథకాల అమలు గురించి చంద్రబాబు సమాధానం చెప్పినప్పటికీ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు కావంటూ ఓటర్లను భయానికి గురిచేస్తున్నారు.

TAGS