Kottu Satyanarayana : దేవాదాయ శాఖ మంత్రి ‘కొట్టు’ను పొట్టుపొట్టు తిట్టిన ఉద్యోగులు..
Kottu Satyanarayana : రాష్ట్రంలో ఎటుచూసినా ఎన్నికల హడావుడి నడుస్తోంది. నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు కూడా తమకున్న ఇబ్బందులను నాయకుల ముందు ఉంచుతున్నారు. కానీ వైసీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి వచ్చే నిరసనలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతీ చోటా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతోంది. ఇక వైసీపీ అభ్యర్థులు ఫ్రస్టేషన్ లో ప్రజలపైనే దాడి చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులను.. వీధి దీపాలు వెలగడం లేదని ప్రశ్నించిన గర్భిణిని నేలపై పడేసి, కాలితో తన్ని దుర్భాషలాడారు. అడ్డొచ్చిన ఆమెను కూడా గొంతు పట్టుకుని దారుణంగా దాడిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు.. వైసీపీ నేతల ఆగడాలు భరించలేని ప్రజలు, ఉద్యోగులు తిరగబడుతున్నారు.
తాజాగా తాడేపల్లి గూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ప్రభుత్వ ఉద్యోగులు చుక్కలు చూపించారు. పొట్టు పొట్టు తిట్టిపోశారు. పోస్టల్ పోలింగ్ కేంద్రంలోకి పోలీస్ పహరాతో వచ్చి హల్ చల్ చేయడంపై ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘‘ఇంకెన్నాళ్లు గూండాయిజం, రౌడీయిజం చేస్తారు.. ఇంకెన్నాళ్లు జనాలను పోలీస్ స్టేషన్ లో కొట్టిస్తారు.. పోలింగ్ కేంద్రంలో అభ్యర్థికి ఏం పని..బెదిరిస్తే భయపడే రోజులు పోయాయి..’’ అంటూ విరుచుకుపడడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వైసీపీ పని అయిపోయిందని, అందరూ మూటముల్లె సర్దుకోవాల్సిందేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని, వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానిస్తున్నారు.