PM Modi : మోడీ దెబ్బ అదుర్స్ కదా.. దెబ్బకు ఠా జగన్ ముఠా..

PM Modi

PM Modi

PM Modi : ఏపీలోని జగన్ సర్కార్ పేదల వికాసం కోసం కాదు.. మాఫియా వికాసం కోసం పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. గత ఐదేళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని.. వైసీపీ మంత్రులు గుండాగిరి చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇక వారి ఆటలు సాగవని, వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందన్నారు.  

ప్రధాని మోడీ ఇలా ఉన్నట్లుండి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడటంతో వైసీపీ నాయకులు డైలమాలో పడ్డారు. జగన్ ప్రభుత్వం మీద మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడంతో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా రాయలసీమ చాలా మంది ముఖ్యమంత్రులను ఇచ్చిందని, అయితే ఎవ్వరూ రాయలసీమకు సరైన న్యాయం చెయ్యలేదని ప్రధాని మోడీ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వైఎస్ జగన్ కూడా రాయలసీమకు చెందినవాడే కావడంతో మోడీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాయలసీమ యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ప్రధాని ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రధాని మోడీ నొక్కి చెప్పడం కూడా వైసీపీ నాయకులకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి రాజంపేట లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రధాని మోడీ ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని టార్గెట్ చేసుకుని రౌడీ రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నాయకులు బిత్తరపోతున్నారని తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొదటిసారి ఏపీలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వచ్చిన ప్రధాని మోడీ ఆరోజు సీఎం జగన్ ను, వైసీపీ నాయకులను ఏమాత్రం విమర్శించకుండా వెళ్లిపోయారు. మా సీఎం జగన్ మంచివాడని, అందుకే మోడీ మా నాయకుడిని విమర్శించలేదని వైసీపీ నాయకులు సంకలు గుద్దుకున్నారు. అయితే ఇప్పుడు అదే మోడీ వైసీపీని, జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేయడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మోడీ ఆరోపణలతో జగన్ తో పాటు ఆయన పార్టీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.

TAGS