Mitchell Marsh Arrogant : ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ కు అంత అహంకారమా?
Mitchell Marsh Arrogant : 2023 వన్డే ప్రపంచ కప్ గెలవడంతో ఆస్ట్రేలియన్ల కళ్లునెత్తికెక్కాయి. అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ప్రపంచ కప్ పై కాళ్లుపెట్టుకుని దిగన ఫొటో సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వారి దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగుండాలనే విషయం తెలియక వెర్రిని తలకెక్కించుకుంటున్నారు. ప్రపంచ కప్ గెలిచిన సందర్భంలో వారు చేసే పనులు అందరికి అసహ్యంగా కనిపిస్తున్నాయి.
పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టు అన్నట్లుగా వారి వెకిలి చేష్టలకు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కప్ కు ఎంతో విలువ ఇవ్వాల్సింది పోయి దాని మీదే కాళ్లు పెట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం వారి బలుపుకు పరాకాష్ట. ఎంత ఉన్నతంగా ఎదిగితే అంత ఒదిగి ఉంటేనే గౌరవం. కానీ ఇలా పిచ్చి చేష్టలు చేస్తే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతారు.
ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ ప్రపంచకప్ పై కాళ్లు పెట్టుకున్న ఫొటోను తొలుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇది చూసిన అతడి ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు. ప్రపంచ కప్ అనే ఇంగిత జ్ణానం లేకుండా దాని మీదే కాళ్లు పెట్టడం దేనికి నిదర్శనం. వారి అహంకారం చూస్తుంటే వారికి పతనం ప్రారంభమైందని తెలుస్తోంది.
ఏదో వారి లక్ కలిసి రావడంతో మనవారి నుంచి కప్ చేజారింది. లేకపోతే మనవారి ముందు వారు ఎంత? వరుస మ్యాచ్ ల విజయాలతో ఊపుమీదున్న భారత్ కు ఫైనల్ ఎప్పుడు కలిసి రాదు. 2003లో కూడా ఇలాగే కంగారులచేతిలో కప్ కోల్పోవాల్సి వచ్చింది. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని అనుకుంటే మళ్లీ వారినే లక్ వరించడం గమనార్హం.