America Elections : అమెరికా ఎన్నికల్లో ఇంకా బ్యాలెట్ వ్యవస్థే.. ఎందుకంటే ?
America Elections : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. భారతదేశంలో ఎన్నికలు చాలా పెద్ద అంశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగం . రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఎన్నికల చట్టానికి సంబంధించి భారతీయుల ఓటింగ్ హక్కులు చాలా సార్లు సంస్కరించబడ్డాయి. దేశంలో ఎన్నికల ప్రక్రియ, నియమాలు, నిబంధనలు, ఆదేశాలు ఓటు హక్కు గౌరవాన్ని కాపాడుకోవడానికి .. సాధ్యమయ్యే అన్ని స్థాయిల నుండి అవినీతిని తొలగించడానికి చాలా సార్లు మార్చబడ్డాయి.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఓటుహక్కుతో ఎన్నుకుంటారు. ఓటు నమోదు మొదలుకొని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం శ్రమ బాగా శ్రమించాల్సి ఉంటుంది. బీఎల్వో నుంచి రిటర్నింగ్ అధికారి వరకు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఎన్నికల క్రతువు సజావుగా ముగుస్తుంది. పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని భారత దేశం ఎన్నికల నిర్వాహణలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈవీఎంలలో ఎన్నికలు నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఈ తరహా ఎన్నికల నిర్వహణ పై పలు రాజకీయ పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అధికార పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. దీంతో సాధారణ జనాల్లో కూడా ఈవీఎంలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇప్పటికీ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో సంప్రదాయ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతినే అనుసరిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. భారతదేశ జనాభా 140కోట్లకు పైచిలుకు చేరుకుంది. దాంతో పోలిస్తే అమెరికా జనాభా కేవలం 30కోట్ల పైమాటే. దీంతో ఓటింగ్ నిర్వహణ వ్యయం భారత్ తో పోల్చుకుంటే అమెరికాలో తక్కువ. భారత్లో ఉన్నంత జనాభా లేకపోవడం.. బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు సజావుగా జరగడం కూడా ఒక కారణమే. భారత్ లో బ్యాలెట్ ఓటింగ్ అయ్యే వ్యయం చాలా ఎక్కువ సైగా ధనబలం ఉన్న నాయకులు తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునే అవకాశం ఉంది. అందుకే ఇండియాలో ఈవీఎం వ్యవస్థను తీసుకొచ్చారు.