Professions In Demand Britain : ఈ వృత్తుల వారికి బ్రిటన్ లో యమా డిమాండ్.. ఈజీగా వీసా.. ఇక వెళ్లడమే తరువాయి..

Professions In Demand Britain

Professions In Demand Britain

Professions In Demand Britain : బ్రిటన్ లో కొన్ని వృత్తుల పనివారికి బాగా డిమండ్ ఉంది. భారత సంతతి ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటి బ్రిటన్. అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇంగ్లండ్, వేల్స్ లోని ప్రతీ ఆరుగురిలో ఒకరు విదేశాలలో పుట్టినవారేనట. ఇందులో భారతీయుల వాటానే ఎక్కువట. దీనికి తోడు గత సంవత్సరం బ్రిటన్ జారీ చేసిన విద్య, ఉద్యోగ, పర్యటక వీసాల్లో ఎక్కువ శాతం భారతీయులకే దక్కాయి.

2020 దౌత్య సంబంధాల తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసాను బ్రిటన్ పున: ప్రారంభించింది. దీంతో బ్రిటన్ కు వలస వెళ్లే వారు 2021తో పోలిస్తే 2022లో 63 శాతం మంది అధికంగా ఉన్నారు. అయితే అక్కడ చదువు పూర్తవ్వగానే ఉద్యోగం సంపాదించడం సవాలే. కానీ, కొన్ని వృత్తుల్లో నైపుణ్యం ఉంటే సులువుగా వర్క్ వీసా ఇస్తుంది.

బ్రిటన్ లో నర్సులు, కేర్ వర్కర్లు, ఫార్మాసిస్టులు వంటి ఆరోగ్య రంగ నిపుణుల కొరత విపరీతంగా ఉంది. కాబట్టి ఈ వృత్తులు చేసే వారికి స్కిల్డ్ వర్కర్ వీసా వేగంగా దొరికే అవకాశం ఉంది.

సాప్ట్‌ వేర్ ఇంజినీరింగ్‌తో పాటూ సంప్రదాయ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీర్లకు మంచి అవకాశాలున్నాయి. ఈ ఇంజినీరింగ్ నిపుణులకు డిమాండ్ బాగా ఉంది. రానున్న ఐదేళ్లల్లో ఇది ఏటా 2.7 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేయబడింది.

ఐటీ బిజినెస్ అనలిస్టులు, సిస్టమ్ డిజైనర్లు,  ఆర్కిటెక్టులు వంటి వారికి కూడా మంచి డిమాండే ఉంది. రానున్న నాలుగేళ్లల్లో ఈ రంగంలో 5,200 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చని బ్రిటన్ ప్రభుత్వం చెప్తోంది.

ఇక, సాఫ్ట్ వేర్ రంగ నిపుణులకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. వచ్చే నాలుగేళ్లలో 12,500 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. యాక్చువరీస్, స్టాటిస్టీషియన్స్, ఎకనామిస్ట్స్ వంటి వారికీ రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. 2027 నాటికి గణిత ఆధారిత నిపుణులకు 23,300 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అక్కడి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి, విద్యార్థులు అభిరుచి, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా కోర్సులు ఎంపిక చేసుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

TAGS