Hyderabad Rains : హైదరాబాద్ లో వర్షం తిప్పలు తప్పవా ???
Hyderabad Rains : వర్షాలు ఎప్పుడైనా రావచ్చు. ఎన్నిరోజులైనా కురిసే అవకాశం ఉంటది. అతివృష్టిని ఎవరూ ఆపలేరు. కానీ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పట్టణాలకు ఉపాధి నిమిత్తం పల్లె ప్రాంతాల నుంచి జనం తరలి వెళుతున్నారు. దింతో పట్టణాల్లో జనసంచారం పెరిగిపోతోంది. జనాభాకు తగిన విదంగా నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఇంటి నిర్మాణాలు జరిగేటప్పుడే ప్రభుత్వ నిబంధనలు పాటించి కట్టడాలు చేపడితే అతివృష్టిని ఆపగలం. నిబంధనలు అతిక్రమించడం, రేకమండేషన్ లతో ఇష్టానుసారంగా బహుళ అంతస్తులు కట్టడంతో వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజానీకానికి ఇబ్బందులు తప్పడంలేదు.
మంగళ వారం జంటనగరాల్లో కురిసిన వర్షంతో గ్రేటర్ లో ప్రజానీకానికి ఇబ్బందులు తప్పలేదు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనం అంతకూడా వర్షపు నీటితో ఇబ్బందులు పడక తప్పలేదు. సుమారు రెండు గంటలకుపైగా ఏకధాటిగా కురిసిన వర్షంతో గ్రేటర్ లోని అనేక కాలనీలు నీటితో నిండుకున్నాయి. మురికి నీరు, చెత్త, చెదారం, తో కాలనీల్లో దుర్గంధం వెదజల్లుతోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ట్రాన్సఫార్మర్ లు కాలిపోవడంతో సంబంధిత కాలనీలు అంధకారంలోనే ఉన్నాయి. పలువురి ఇళ్లలో టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్ లు కాలిపోయాయి. మంగళవారం రాత్రంతా కూడా కటిక చీకటిలోనే వందల కుటుంబాలు గడిపారు.
గ్రేటర్ పరిధిలోని రోడ్లు జలమయం అయ్యాయి. దింతో రోడ్ మార్గం సరిగా కనిపించక పోవడంతో వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రుభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు సకాలంలో ఇంటికి చేరుకోలేకపోయారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను అదుపుచేయడం సంబంధిత అధికారులతో సాధ్యంకాలేదు.
మెట్రో రైల్ ద్వారా ఇంటికి వెళుదామనుకున్న వారికీ ఇబ్బందులు తప్పలేదు. మెట్రో రైల్ స్టేషన్ కూడా అంతరాయం ఏర్పడటంతో ప్రజలకు రవాణా ఇబ్బందులు తప్పలేదు. వర్షానికి తట్టుకోలేక మెట్రో స్టేషన్ కు చేరుకోవడంతో రద్దీ పెరిగింది. మెట్రో అధికారులు ప్రయాణికులకు ఉండాల్సిన సేవలను నిలిపివేశారు. అసౌకర్యానికి ప్రయాణికులు అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు వస్తున్నారు. పోతున్నారు. కానీ పరిస్థితి మాత్రం గ్రేటర్ లో మారడంలేదు. ప్రజల ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా సౌకర్యాలు ఆశించిన మేరకు ఉండటంలేదు. ప్రజల సౌకర్యాలపై నిర్లక్ష్యం వహించడంపై గ్రేటర్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.