Jharkhand Minister : పర్సనల్ సెక్రటరీ పని మనిషి ఇంట్లో రూ. 35 కోట్లు.. మంత్రి తెలివికి హ్యాట్సాఫ్..

Jharkhand Minister

Jharkhand Minister

Jharkhand Minister : అవినీతి కేసుల్లో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఆయన పర్సనల్ సెక్రటరీలు వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేయడం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఆలోచించిన ఒక మినిస్టర్ చాలా తెలివిగా వ్యవహరించాడు. పర్సనల్ సెక్రటరీ వద్ద, ఆయన కుటుంబ సభ్యుల వద్ద కాకుండా ఆయన ఇంట్లో పని చేసే పని మనిషి వద్ద అవినీతి సొమ్మును దాచాడు. అయితే ఈడీ మెల్లగా తీగ లాగడంతో డొంక కదిలింది.

అవినీతి కేసులో రూ.35 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ మంత్రి అలంజీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ లాల్ ఇంట్లో పని చేసే జహంగీర్ ఆలంలను మంగళవారం ఉదయం అరెస్టు చేసింది. దీనిపై మంత్రిని ప్రశ్నించేందుకు ఆర్థిక దర్యాప్తు సంస్థ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆయనకు సమన్లు జారీ చేయనున్నారు.

అలంగీర్ ఆలం పీఎస్, ఇతర సన్నిహితుల నివాసాల్లో ఈడీ సోమవారం సోదాలు నిర్వహించింది. పట్టుబడిన కరెన్సీ నోట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. మొత్తం రూ.35.23 కోట్లు ఉన్నట్లు తేల్చారు.

పని మనిషి జహంగీర్ ఆలం తన ప్రాథమిక విచారణలో కమీషన్, లంచం రూపంలో మంత్రి తీసుకునే డబ్బుకు కేర్ టేకర్ అని, దీని కోసం నెలకు రూ.15,000 జీతం తీసుకుంటున్నట్లు అంగీకరించాడని అధికారులు తెలిపారు.

మంత్రి అలంగీర్ తన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ లాల్ నివాసంలో జహంగీర్ ను పనిమనిషిగా నియమించుకున్నాడు. దీనికి ముందు కొన్ని రోజులు జహంగీర్ మంత్రి నివాసంలో పనిచేశాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సంజీవ్ కుమార్ లాల్ రాంచీలోని సర్ సయ్యద్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్ లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. సంజీవ్ తనకు సంచి డబ్బు కట్టులు పెట్టి లేదా ఒక్కొక్కటిగా డబ్బు కట్ట ఇచ్చేవాడని, దాన్ని ఈ ఫ్లాట్లోని అల్మారాల్లో భద్రపరిచేవాడని తెలిపాయి.

సంజీవ్ నివాసం నుంచి రూ.10 లక్షలు, ఆయన భార్య నిర్మాణ సంస్థ భాగస్వామి బిల్డర్ మున్నా సింగ్ నివాసం నుంచి రూ.2.93 కోట్లు ఈడీ స్వాధీనం చేసుకుంది.

అయితే జహంగీర్ ఫ్లాట్ నుంచి వచ్చిన డబ్బు తనదేనని సంజీవ్ తొలుత ఖండించినప్పటికీ బలమైన సాక్ష్యాధారాలు, జహంగీర్ వాంగ్మూలం తర్వాత ఈడీ అతన్ని అరెస్టు చేసింది.

సోమవారం నిర్వహించిన సోదాల్లో బదిలీలకు సంబంధించిన రికార్డులతో పాటు పలు డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.

జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ బ్యూరోక్రాట్ల పోస్టింగ్ కోసం చేసిన సిఫార్సును ఈ పత్రాల్లో ప్రస్తావించారు. దీంతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖలో అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖ కూడా ఈడీకి అందింది.

ఈడీ లేఖపై చర్యలు తీసుకోవడానికి బదులు ప్రభుత్వం ఆ శాఖ అధికారులకు లీక్ చేసిందని భావిస్తున్నారు.

TAGS