AP DGP : ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు
AP DGP : ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో వారం పోలింగ్ జరగనుండగా డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమవారం ఉదయం 11 గంటల తోగా ముగ్గురు డీజీపీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఎన్నికల సంఘం సీఎస్ ను ఆదేశించింది.
ఏపీ డీజీపీ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు కొంత కాలంగా ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని, సీఎస్ ను మార్చాలంటూ విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీజీపీని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.