TDP Vs YCP : టీడీపీ ఫీజు రీయింబర్స్ మెంట్ కు వైసీపీ పంపిణీకి తేడా ఇది

TDP Vs YCP

YCP Vs TDP Fee Reimbursement : ఏపీలో జగన్ ప్రభుత్వం ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టకుండా వదల్లేదు. పేదల భూములను గుంజుకోవడానికి  ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవడమే కాదు.. సంక్షేమ పథకాల పేరుతో రూపాయి ఇచ్చి ప్రజల నుంచి వంద రూపాయలు గుంజుకుంటున్నారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయలేదు. మెగా డీఎస్సీని దగా చేశారు. ఏదో తూతూ మంత్రంగా పది పరకా పోస్టులు వేసి లక్షల అభ్యర్థులను మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలోనూ తీవ్ర అన్యాయం చేశారు. ఈ విషయమై ఓ స్టూడెంట్ యూనియన్ నేత ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి, ఇప్పటి వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడాను కళ్లకు కట్టినట్టు చెప్పాడు.. ఆయన చెప్పిన విషయాల ప్రకారం..

తెలుగు దేశం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్  వేసినప్పుడు డైరెక్ట్ గా కాలేజీకే అందించేది. విద్యార్థి ఫీజు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి ఠంఛన్ గా ఆ ఫీజును కాలేజీకి అందించేది. ఆ ఫీజు ఓ ఆరు నెలలు లేటయినా, సంవత్సరం లేటయినా విద్యార్థికి సంబంధం ఉండేది కాదు. ఫీజు విషయాన్ని గవర్నమెంట్, కాలేజీ మాత్రమే చూసుకునేవి. విద్యార్థి చదువుకు ఎలాంటి నష్టం జరుగలేదు.

జగన్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను డైరెక్ట్ గా విద్యార్థి ఖాతాలో జమ చేస్తున్నాడు. అయితే 2020-21లో ఓ విడత వేయనేలేదు. అలాగే మిగతా సంవత్సరాల్లోనూ స్లో చేశారు. ఇప్పటికీ ఓ బ్యాచ్ కు ఫీజు రీయింబర్స్ మెంట్ వేయనేలేదు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక వీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫీజు కట్టలేదని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వక ఇబ్బందులు పెడుతున్నాయి. గతంలో కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవి, విద్యార్థికి ఏ సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థికే డబ్బులు వేస్తుంది కాబట్టి యాజమాన్యాలు విద్యార్థినే డబ్బులు అడుగుతున్నాయి. దీంతో విద్యార్థులు అటు ప్రభుత్వం, ఇటు కాలేజీ యాజమాన్యాల చేతిలో ఇబ్బందులు పడుతున్నారు. దీనికంతటికీ కారణం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. అనవసర విధానాలతో విద్యార్థులకు నష్టమే జరిగిందంటున్నారు.

TAGS