Viral Video : ఉద్యోగులను ఓటు వేయనివ్వకుండా చేస్తున్నారు..ఓ ఉద్యోగి ఆవేదన..వీడియో వైరల్..

Viral Video

Viral Video

Viral Video : ఏపీలో అరాచక పాలనను అంతమొందించే సమయాన వైసీపీ ఎలాంటి దుర్మార్గానికైనా వెనుకాడడం లేదు. సీఎం రమేశ్ పై దాడి చేసిన ఘటన మనం చూస్తూనే ఉన్నాం. చివరకు ఉద్యోగుల పోస్టల్ ఓటుపై కూడా గందరగోళం నెలకొనేలా చేశఆరు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వైసీపీపై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారనే అనుమానంతో వారికి ఓటు వేసే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అధికార పార్టీ తమకు అనుకూలంగా ఉండే కొందరు ఎన్నికల అధికారుల సాయంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోకుండా గందరగోళం సృష్టిస్తోంది.

ఎన్నికల విధుల్లో పాల్గొనేవారికి వారికి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ లోనే బ్యాలెట్ ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు. పీవోలుగా నియమించిన వారు ఈనెల 3 నుంచి 8వరకు హోం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగులు 5,6 తేదీల్లో ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎలా వేస్తారో ఎన్నికల అధికారులే చెప్పాలి. దీనిపై స్పష్టమైన ఆదేశాలను ఇంతవరకు ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఇలా అయితే కష్టమని పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని మరింత పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. కృష్ణా జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు జిల్లా ఫెసిలిటేషన్ కేంద్రంలో 4న ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పీవోలకు పంపిన ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. తీరా శనివారం ఫెసిలేటేషన్ సెంటర్ కు వెళ్లిన వారికి చుక్కెదురైంది. ఈ రోజు కాదు ఎల్లుండి రండి అంటూ అధికారులు చెప్పడంతో వారంతా అక్కడే నిరసన వ్యక్తం చేశారు. కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అభాసుపాలవుతోందని మండిపడుతున్నారు.

ఓ ఉపాధ్యాయుడికి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల అధికారులు ఇవ్వకపోవడంతో అతడు తన ఆవేదనను మీడియాతో వెళ్లబోసుకున్నాడు. ఉద్యోగులు ఓటు వేయవద్దనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అన్నాడు. కనీసం హెల్ప్ డెస్క్ కూడా లేదన్నారు. మీ డ్యూటీ దగ్గరే ఓటు వేయాలని సూచిస్తున్నారని అంటున్నారని వాపోయాడు. చదువుకున్న ఉద్యోగులకు పోస్టల్ పెట్టడం ఏంటని..ఈవీఎంలో ఓటు వేసే పద్ధతి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

TAGS