Movies on OTT : ఓటీటీలో ఎంగేజింగ్ మూవీస్.. ఈ 8 సినిమాలు చూడాల్సిందే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Movies on OTT

Movies on OTT

Movies on OTT  : నేడు సౌత్ సినిమా భారత సినీ ఇండస్ట్రీని ఏలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల సినిమాలకు థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా విపరీతమైన వ్యూవ్స్ వస్తున్నాయి. థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపిన తెలుగు సినిమాలు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ + హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వస్తున్నాయి. మేలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు సినిమాల్లో ఎనిమిదింటి గురించి తెలుసుకుందాం.

1. అసురగురు (ఆహా)

విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘అసుర గురు’. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు రాజ్ దీప్ దర్శకత్వం వహించారు. మే 3న ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. సామాన్య ప్రజలకు సాయం చేసేందుకు సంపన్నుల నుంచి డబ్బును కాజేసే దొంగగా విక్రమ్ ప్రభు పాత్ర ఉంటుంది. కంటెంట్ పాతదే అయినా.. స్టోరీని మంచి వేలో తీసుకెళ్లాడు డైరెక్టర్. ట్విస్ట్ లు, ఎంగేజింగ్ గా ఉన్నా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. సుబ్బరాజు, యోగిబాబు ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేశారు.

2. ప్రణయ విలాసం (ఈటీవీ విన్)

మలయాళ చిత్రం ‘ప్రణయ విలాసం’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే2న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. నిఖిల్ మురళి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాలో మామితా బైజు, అర్జున్ అశోకన్, అనశ్వర రాజన్ నటించారు. మలయాళంలో 2023, ఫిబ్రవరి 24న విడుదలైన ఈ సినిమాకు షాన్ రెహమాన్ సంగీతం అందించారు. సూపర్ శరణ్య నుంచి ప్రధాన తారాగణంతో తెరకెక్కింది ఈ చిత్రం.

3. సిద్ధార్థ్ రాయ్ (ఆహా)

యశస్వి దర్శకత్వం వహించిన సినిమా ‘సిద్ధార్థ్ రాయ్’. ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. మే 3న ఆహాలో స్టీమింగ్ అవుతుంది. సిద్ధార్థ్ రాయ్ జీవితంపై తన దృక్పథాన్ని మార్చుకుంటాడు. కథనంపై విమర్శలు వచ్చాయి. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ నిర్మించిన ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు.

4. హ్యాపీ ఎండింగ్ (ఆహా)

కోశిక్ భీమిడి దర్శకత్వం వహించిన యశ్ పూరి సినిమా ‘హ్యాపీ ఎండింగ్’. చిన్నతనంలో ఒక దేవుడితో శపించబడిన హర్ష్ కథను చెప్తుంది. అతనితో సన్నితంగా ఉన్న వారు అందరూ చనిపోతుంటారు. ఈ నేపథ్యంలో కథ మలుపు తిరుగుతుంది. ఆహాలో స్ట్రీమింగ్ లో ఉంది.

5. రివాల్వర్ రీటా (నెట్ ఫ్లిక్స్)

1970లో విజయలలిత, జ్యోతిలక్ష్మి జంటగా నటించిన ‘రివాల్వర్ రీటా’ చిత్రంపై ఆసక్తి నెలకొంది. కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా కథకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. దీంతో ఇది రీమేక్ అవుతుందా లేక రీమేక్ అవుతుందా అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

6. మంజుముల్ బాయ్స్ (డిస్నీ+ హాట్ స్టార్)

2024 లో హిట్ అయిన మలయాళ చిత్రం ‘మంజుముల్ బాయ్స్’ కూడా మే5 నుంచి డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదిరిచూశారు. తమిళనాడులోని కొడైకెనాల్ లోని గుణ గుహలకు 10 మంది స్నేహితులు సాహసోపేత యాత్ర నేపథ్యంలో కథ సాగుతుంది. వారికి ఎదురయ్యే భయానక సన్నివేశాలపై సినిమా సాగుతుంది.

7. లైన్ మ్యాన్ (ప్రైమ్ వీడియో)

త్రిగుణ్ కథానాయకుడిగా వీ రఘు శాస్త్రి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైన్ మ్యాన్’. పర్పుల్ రాక్ ఎంటర్ టైనర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కుందర్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చిలో తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శననే ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ మే 3న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ లో ఉంది.

8. శ్రీరంగ నీతులు

ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వంలో సుహాస్, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’. జీవితంలో వివిధ సవాళ్లను ఎదుర్కొనే 4 పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. సుహాస్ టీవీ మెకానిక్ గా నటించాడు. కార్తీక్ రత్నం డ్రగ్స్ కు బానిసగా మారుతాడు. విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ లో  ఉంటారు. ఈ వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలను, వాటి ద్వారా వారు ఎలా నేవిగేట్ చేస్తారో శ్రీరంగ నీతులు లో వివరించారు. మే మొదటి వారంలో లేదా మధ్యలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. అయితే, నిర్ధిష్ట ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించలేదు.

TAGS