Shivaji Politics : శివాజీ.. రాజకీయం సినిమా ఒకటి కాదు

Shivaji Politics

Shivaji Politics

Shivaji Politics : తెలుగు సినిమా నటుడు శివాజీ. ఆయనకు సినిమాలో తీరిక ఉండదు. అయినా అప్పుడప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. ఎందుకంటే సినిమాల్లో డైలాగులు పేల్చినట్టు రాజకీయాల్లో కూడా డైలాగులు పేల్చి సంచలనం సృష్టిస్తున్నారు ఈ మధ్య. రాజకీయంగా ఇటీవల ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చకు అవకాశం ఇచ్చాయి. 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర లో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంది.

అప్పుడు శివాజీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యువతను కలుపుకొని ఉద్యమాలు చేపట్టారు. ప్రత్యేక హోదా లేకపోవడం వలన పరిశ్రమలు రావడం లేదని, ఉద్యోగ అవకాశాలను యువత కోల్పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ శివాజీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి మద్దతు ఉందని, అందుకే వైసీపీ పార్టీ ప్రత్యేక రాష్ట్రము హోదా గురించి నోరు మెదపడం లేదని ఆరోజుల్లో ఆరోపించారు.

ఇప్పుడు అదే బీజేపీ తెలుగు దేశం పార్టీతో తాజా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న విషయం మీ కళ్ళకు కనబడుటలేదా అని అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడు బీజేపీ ని విమర్శించిన మీరు, టీడీపీ తో పొత్తు పెట్టుకోగానే అదే బీజేపీ ని ఎందుకు ప్రత్యేక హోదా గురించి నిలదీయడం లేదని యువత ప్రశ్నిస్తోంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరి. హోదాను కేంద్ర ప్రభుత్వం కల్పించిందంటే పరిశ్రమలు వస్తాయి.

దాంతో ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయి. వీటి గురించి బీజేపీ ని ఎందుకు నిలదీయడంలేదని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తోంది. రాష్ట్రము విభజన జరిగిన తరువాత నుంచి నేటి వరకు రాష్ట్రము అభివృద్ధి గురించి గణాంకాల ప్రకారం మాట్లాడాలి. అంతేకాని సినిమా రచయితలు రాసిస్తే డైలాగులు కొట్టినట్టుగా రాష్ట్రము గురించి మాట్లాడరాదు. విభజన అయిన తరువాత తెలుగు దేశం, వైసీపీ నాయకులు  ఒక్కోసారి పరిపాలించారు. వీరిద్దరి పరిపాలనలో

పరిశ్రమలు ఎన్ని వచ్చాయి. ఉద్యోగాల భర్తీ ఎంత జరిగింది. ఆదాయం ఎంత పెరిగింది. ఖర్చు ఎంత అయ్యింది. ఎన్ని పెట్టుబడులు వచ్చినవి. అనే అంశాలపై గణాంకాల ప్రకారం మాట్లాడాలి. అంతేగాని గణాంకాలు లేకుండా సినిమా కెమెరా ముందు మాట్లాడినట్టు మాట్లాడితే ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం లోకి వస్తే ముస్లింలకు  రిజర్వేషన్ లు ఉండవని, రాజ్యాంగం మారుస్తారని ప్రచారం జరుగుతోంది. దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్నలు కూడా శివాజీ కి వెల్లువెత్తుతున్నాయి.

TAGS