YCP Welfare Schemes : సంక్షేమ పథకాలపై వైసీపీ వెనుకడుగు
YCP Welfare Schemes : సంక్షేమ పథకాలు అంటే వైసీపీ, వైసిపి అంటే సంక్షేమ పథకాలు అనే విదంగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఉండేది గతంలో కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం సంక్షేమ పథకాలను తన మేనిఫెస్టో లో చేర్చడానికి వెనుకడుగు వేసినట్టుగా రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ , జనసేన పార్టీల కూటమి ముందుగా తన మేనిఫెస్టో ప్రకటించింది. ఆ తరువాతనే వైసీపీ అదినేత జగన్ తన మేనిఫెస్టో విడుదల చేశారు. కూటమి మేనిఫెస్టో చూసిన ప్రజలు మాత్రం రాబోయే జగన్ మేనిఫెస్టో పై భారీ ఆశలు పెట్టుకున్నారు. జగన్ మేనిఫెస్టో చూసిన తరువాత ప్రజలు పెదవి విరిచారు. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం జగన్ ఈసారి వెనుకడుగు వేసినట్టుగా ప్రజలతో పాటు రాజకీయ శ్రేణులు సైతం చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అవలంబించిన పద్ధతినే ఆంధ్ర లో వైసీపీ కూడా అదే తోవలో నడుస్తున్నదా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది. కానీ బిఆర్ఎస్ మాత్రం ఆకట్టుకునే హామీలు ఇవ్వలేదు. అందుకు గులాబీ నేతలు నష్టాన్ని చూడాల్సి వచ్చింది.
టీడీపీ, జనసేన, బీజేపీ లతో ఏర్పడిన కూటమి మేనిఫెస్టో ను అధికారం లోకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అమలుచేయాల్సిందే. అమలుచేయడానికి తాము కట్టుబడి ఉన్నామంటూ కూడా ప్రజలను నమ్మించే విదంగా ప్రసంగాలు కూడా ఉండాలి. ప్రజలను నమ్మించే విదంగా ప్రచారం చేయని నేపథ్యంలో కూటమి ఇంటిబాట పట్టక తప్పదు అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ప్రజల్లో కూటమి మానిఫెస్ట్ పై నమ్మకం ఏర్పడితే మాత్రం వైసీపీ అధినేతకు రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రం కష్టమే అవుతుంది.
కూటమి మానిఫెస్టోలో ప్రతి నెల నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు, ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడేసి చొప్పున గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయల ఫించన్, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అనే ఈ నాలుగు హామీలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నాలుగు పథకాలపై ఆశతోనైనా కూటమిగా ఏర్పడిన పార్టీల అభ్యర్థులను గెలిపించుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.