Team India : టీమిండియాకు తొలిసారి ఆరుగురు కొత్తవారే..

Team India

Team India

Team India : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ మినీ ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టులో మొత్తం 19 మంది ప్లేయర్లను ఎంపికయ్యారు. వీరిలో 15 మంది  ప్రధాన జట్టులో ఉంటారు. మిగిలిన నలుగురిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ప్రకటించిన టీమిండియా జట్టులోని ఈ ఆరుగురు ప్లేయర్లు  తొలిసారి  ప్రపంచకప్ లో ఆడబోతున్నారు.

యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ కు  ఎంపికయ్యాడు. 22 ఏళ్ల యశస్వి గతేడాది టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. టీమిండియా తరపున ఇప్పటివరకు 17 టీ20 మ్యాచ్‌లు ఆడిన యశస్వీ 161.93 స్ట్రైక్ రేట్‌తో 502 రన్స్  చేశాడు. సంజూ శాంసన్ రెండో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ పేరు చాలా చర్చనీయాంశమైంది. శాంసన్ తన కెరీర్‌లో తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్నాడు. సంజూ శాంసన్ ఇప్పటివరకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడి 133.09 స్ట్రైక్ రేట్‌తో 374 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో దూకుడు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు శివమ్ దూబే.  ఎట్టకేలకు టీమిండియా జట్టులో చోటు సంపాదించాడు.

శివమ్ టీమిండియా తరపున 21 టీ20 మ్యాచ్‌లు ఆడి 276 పరుగులు పూర్తి చేశాడు. కుల్దీప్ యాదవ్ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇంతకు ముందెన్నడూ టీ20 ప్రపంచ కప్‌లో ఆడలేదు. అతను ఈ ఫార్మాట్‌లో టీమిండియా తరఫున 35 మ్యాచ్‌లు ఆడి  59 వికెట్లు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు అత్యంత అనుభవం ఉన్న ఆటగాళ్లలో చాహల్ ఒకరు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గుర్తింపు పొందారు. భారత్ తరపున ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు.  సిరాజ్‌ భారత్‌ తరపున టీ20 ఫార్మాట్‌లో ఆడిన అనుభవం లేదు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు ఫాస్ట్ బౌలర్ సిరాజ్.  తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ తుది జట్టుకు ఎంపికయ్యాడు.   ఆడనున్నాడు.

TAGS