Manne Krishank : పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్
Manne Krishank : బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియో విశ్వవిద్యాలయం మెస్ ల మూసివేతపై దుష్ప్రచార చేసిన కేసులో క్రిశాంక్ తో పాటు ఓయూ విద్యార్థి నాగేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా క్రిశాంక్ కారును పతంగి టోల్ ప్లాజా దగ్గర ఆపి వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రతి సంవత్సరం వసతి గృహాల మెస్ ల మూసివేతపై ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యులర్ జారీ చేయగా, వాటిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్లు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్రిశాంక్, నాగేందర్ ను అదుపులోకి తీసుకున్నారు.
while returning to Hyderabad from Kothagudem to participate in Press Conference of KTR garu, Police have stopped at Panthangi Checkpost . From last 30 minutes instead of checking vehicle they have made us stand saying Higher Officials will come … pic.twitter.com/f0EW9eDAGV
— Krishank (@Krishank_BRS) May 1, 2024