CM Revanth : తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు: సీఎం రేవంత్
CM Revanth : గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం మోదీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాం. . కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని ఆయన విమర్శించారు.
‘‘తెలంగాణ అడిగింది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అడిగింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అడిగింది కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం.. బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అడిగింది మేడారం జాతరకు జాతీయ హోదా.. బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అభవృద్ధికి బీజేపీనే అడ్డు. పదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని రేవంత్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు.