KCR : కేసీఆర్ మాటలే బీఆర్ఎస్ కు నష్టాలు తీసుకొస్తున్నాయా?
KCR : ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయింది. కేసీఆర్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. పదేళ్లు ఊకదంపుడు ఉపన్యాసాలు విని విసిగిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఏది మాట్లాడినా దానికి రివర్స్ గా తీసుకుంటున్నారు. పదేళ్ల పాలనలో ఏనాటు రైతులను కలవని కేసీఆర్ ఇప్పుడు ఏదో అయిపోయిందని మొసలి కన్నీరు కారుస్తూ రైతులను కలవడం కాస్త ఇబ్బందికరంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ నేతలు మొదటి నుంచి మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రాజెక్టు కుంగిన తరువాత ప్రాజెక్టులన్నాక కుంగుతాయని బీఆర్ఎస్ మొండి పాట అందుకోవడం వారికే చెల్లింది. అది కట్టి ఎన్నాళ్లయింది? ఎన్నాళ్లకు కూలిపోవాలి? కట్టి పదేళ్లు కూడా కాకముందే కూలితే ఏమనుకోవాలి?
ప్రధానమంత్రి మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించగానే కేసీఆర్ స్పందించి దానిపై విచారణ చేపట్టాలని పల్లవి అందుకోవడం ఎబ్బెట్టుగా లేదా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన లోటుపాట్ల గురించి ఆరా తీస్తే జీవితాంతం వారు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అలాంటిది ఇప్పుడు ప్రధాని వ్యాఖ్యలకు వంత పాడుతూ తన గోతులు తానే తవ్వుకుంటున్నట్లు అనిపిస్తోంది.
కేసీఆర్ ప్రసంగం ప్రస్తుతం గతి తప్పుతోంది. ఇన్నాళ్లు ఏం చెప్పినా ఆసక్తిగా విన్న ప్రజలు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. ఏది మాట్లాడినా నెగెటివ్ గానే తీసుకుంటున్నారు. కేసీఆర్ మాటలకు బోల్తా పడే వారు లేకుండా పోయారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడినా అందులో చెడు మాత్రమే తీసుకుంటున్నారు. మంచిని వదిలేస్తున్నారు. ఇన్నాళ్లు మంచినీ తీసుకున్నా ఇప్పుడు పరిస్థితిలో చేంజ్ వచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపడితే చాలా మంది జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలే ఎక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో వారి అవినీతిపై చర్చలు పెడితే వారే బుక్కయ్యే అవకాశాలు ఉన్నాయి.