Hyderabad-UT : హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం.. కేటీఆర్ పదే పదే ఎందుకు అంటున్నారు?
Hyderabad-UT : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందని కేసీఆర్ తనయుడు కేటీఆర్ అన్నారు. ‘మీరు కనీసం 12 మంది బీఆర్ఎస్ ఎంపీలను తెలంగాణ నుంచి పార్లమెంటుకు పంపకపోతే, కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తుంది’ అని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ తెలంగాణ ప్రజలను హెచ్చరించారు.
కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా..? హైదరాబాద్ యూటీగా మారుతుందా?
కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఈ విషయాన్ని ప్రచారం చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే కుట్రలకు ఆంధ్రా నాయకుల తెర లేపుతున్నారని తీవ్రంగా ప్రచారం చేశారు. మళ్లీ ఇప్పుడు అదే రాగం అందుకున్నారు.
నిజానికి తెలంగాణ కోసం జరిగిన పోరాటం హైదరాబాద్ కోసం చేసిన పోరాటమే. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినంత రాబడిలో మూడో వంతు కేవలం హైదరాబాద్ నుంచే వస్తుంది. బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే హైదరాబాద్ ను యూటీ చేయడం అంత సులువు కాదు. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడితే అప్పుడు భారతదేశానికి రెండో రాజధానిగా ప్రకటించడం ద్వారా హైదరాబాద్ ను యూటీగా చేయవచ్చు.
ఇది దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను సంఘటితం చేసేందుకు, ఒవైసీ సోదరులు లేదా ఇస్లామిక్ ఫండమెంటలిజం ముప్పును ఎదుర్కోవటానికి దక్షిణాదిలో బీజేపీకి బలమైన పునాది ఇస్తుంది. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని యూటీ ప్రతిపాదన చేస్తే తెలంగాణ ప్రజలు కూడా అభ్యంతరం చెప్పరు.