Viral Video : పోలింగ్ బూత్ లో ఓటర్ చేసిన పనికి అంతా షాక్..వీడియో వైరల్
Viral Video : దేశంలో ఎటు చూసినా సార్వత్రిక ఎన్నికల సందడే కనిపిస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉవ్విళ్లూరుతున్నారు. 400 సీట్లు గెలవాలని క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో మోదీని గద్దె దించాల్సిందేనన్న పట్టుదలతో ఇండియా కూటమి నేతలు ఉన్నారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు దశలు ఎన్నికలు పూర్తి అయ్యాయి. తుది విడత జూన్ 1న నిర్వహించనున్నారు. జూన్ 4 ఫలితాలు ప్రకటించనున్నారు.
ఇప్పటివరకు జరిగిన రెండు దశల ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసినా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. అయితే వాటితో ఎన్నికల ప్రక్రియకు పెద్దగా నష్టమేమి జరుగలేదు. కర్నాటకలో జరిగిన రెండో దశలో ఓ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాడు. తన ఓటరు ఐడీ చూపించి పోలింగ్ అధికారుల దగ్గర తన సంతకం చేయడంతో పాటు వేలికి సిరా చుక్క వేయించుకున్నాడు. అనంతరం ఓటు వేసేందుకు వెళ్తుండగా ఓ అధికారి వద్ద ఉన్న ఈవీఎంను మెయింటెన్ చేసే ఓ బాక్స్ ను ఎత్తి కింద పడవేశాడు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో వెంటనే పోలీసులు, అధికారులు అప్రమత్తమై అతడిని బయటకు తీసుకెళ్లారు. మరి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారా లేదా అనేది తెలియదు. ఏ కారణాల వల్ల అలా చేశాడనేది కూడా సమాచారం లేదు.
ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండడంతో మిగిలిన దశల్లో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇక ఏపీలో జరిగే ఎన్నికల్లో ఓడిపోతామన్న ఫ్రస్టేషన్ లో వైసీపీ శ్రేణులు కూడా ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉందని ప్రతిపక్షపార్టీల శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సంఘం అప్రమత్తంగా ఉండి ఎన్నికలను సజావుగా నిర్వహించాలని వారు కోరుతున్నారు.