Megastar Chiranjeevi : కూటమికి మద్దతుగా మెగాస్టార్..మే 5 నుంచి ప్రచారం..వైసీపీకి ఇక చుక్కలే..

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi :ఏపీ ఎన్నికల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్..దశాబ్ద కాలం తర్వాత మళ్లీ మెగాస్టార్ రాజకీయ ప్రచారంలోకి దూకబోతున్నాడు. ఇక రాజకీయాల్లోకి రాను అంటూ దాటేసుకుంటూ వచ్చిన సినీమేరు శిఖరం కూటమి తరుఫున ప్రచార బరిలోకి దిగబోతున్నారు. సినీ పరిశ్రమలో గత నాలుగు దశాబ్దాలుగా మహారాజుగా వెలుగొందుతన్న మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి కోసం ప్రజల్లోకి రానున్నాడు. కోట్లాది అభిమానులే కాదు సగటు ప్రజానీకం సైతం ‘మా చిరంజీవి’ అనుకునే వ్యక్తిత్వం ఆయనది. ప్రతీ తెలుగింటి ఆప్తుడు, ప్రతీ ఇంటి మనిషి ఇక ఆంధ్రప్రదేశ్ భవిత కోసం ప్రచార రంగంలోకి దిగనున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున మే 5వ తేదీ నుంచి మే 11వరకు ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజాతశత్రువుగా అన్ని పార్టీల్లో ఆప్తులు ఉన్న ఆయన రాష్ట్ర పరిస్థితులు, తమ్ముడి జనసేన పార్టీతో కూటమికి ఊపు తేవాలనే ఉద్దేశంతో ప్రచారంలోకి దిగబోతున్నారు. మెగాస్టార్ ప్రచారంలోకి వస్తే వైసీపీకి ఇక చుక్కలే కనపడబోతున్నాయి. ప్రజల్లో సానుకూలత ఉన్న  చిరంజీవి ప్రచారంతో కూటమికి పెద్ద బోనస్ కానుంది. కోట్లాది అభిమాన గణం ఉన్న చిరు రాకతో కూటమికి ఎక్కడలేని ధైర్యం వచ్చినట్టే.

ఇప్పటికే వైసీపీకి ఓటమి ఖాయమనే భయంతో ఉంది. ఏదో పైకి బీరాలు పలుకుతున్న ముప్పేటా కూటమి నేతల మోహరింపు ఆ పార్టీని వణికిస్తోంది. ‘నిజం గెలవాలి’తో నారా భువనేశ్వరి,  ‘ప్రజా గళం’ పేరుతో నారా చంద్రబాబు నాయుడు,  ‘వారహి’ పేరుతో పవన్ కళ్యాణ్, ‘అన్ స్టాపబుల్’ పేరుతో నందమూరి బాలకృష్ణ, ‘యువ గళం’ పేరుతో లోకేష్, ర్యాలీల పేరుతో దగ్గుపాటి పురుందేశ్వరి, ఫైనల్ గా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి గా ప్రజా గళం బహిరంగ సభలకు తోడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తోడు కావడంతో వైసీపీకి ఘోర పరాజయం తప్పదు.

రాజధాని ఎఫెక్ట్ తో కృష్ణా, గుంటూరు, కాపు ఎఫెక్ట్ తో ఈస్ట్, వెస్ట్, బీసీ ఎఫెక్ట్ తో అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూల్, ప్రకాశం, చిత్తూరు..భూ ఆక్రమణలు, దౌర్జన్యంతో విశాఖపట్నం, పెద్దా రెడ్ల ఎఫెక్ట్ తో నెల్లూరు, జిల్లా కేంద్రం ఎఫెక్ట్ & బలిజల ఎఫెక్ట్ తో రాజంపేట పార్లమెంట్,  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తో కడప పార్లమెంట్..ఇలా  రాష్ట్ర వ్యాప్తంగా తుడిచి పెట్టుకొని పోయే పరిస్థితి వైసీపీది… ప్రచారం లో గడ్డు పరిస్థితులు…మరోపక్క మేనిఫెస్టో తో తెలిపోయిన వైసీపీ… పస లేని మేనిఫెస్టో అంటూ సొంత నేతలే పెదవి విరుస్తున్నారు.  

TAGS