IOC : డాక్టర్ జై గారి యూబ్లడ్ సేవలను అభినందించిన సామ్ పిట్రోడా

IOC : అమెరికాలోని న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ పాలెస్ లో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్(ఐఓసీ)’ ఘనంగా జరిగింది. దీపావళిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమానికి దిగ్గజాలు హాజరయ్యారు. ఐఓసీ గ్లోబల్ చైర్మన్ గా సామ్ పిట్రోడా ఉన్నారు. భారతీయ టెలికమ్యూనికేషన్స్ పితామహుడిగా పేరొందిన సామ్ పిట్రోడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూబ్లడ్ యాప్ ద్వారా ఎంతో మందికి రక్తం అందేలా చేస్తున్న ఆ యాప్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారి సేవలను కొనియాడారు. జై గారు చేస్తోన్న సమాజ సేవను వేయినోళ్ల కొనియాడారు. మీలాంటి వారు సమాజానికి అవసరం అంటూ ప్రశంసలు కురిపించారు.

-సామ్ పిట్రోడా ఎవరంటే?
సత్యన్‌నారాయణ గంగారామ్ పిట్రోడాను శామ్ పిట్రోడా అని కూడా పిలుస్తారు. భారతీయ టెలికమ్యూనికేషన్ ఆవిష్కర్తగా పేరొందారు. టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ , ఎంటర్ పెన్యూనర్ గా గుర్తింపు పొందాడు. భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని టిట్లాగర్‌లో గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. డా. మన్మోహన్ సింగ్ హయాంలో ప్రధానమంత్రికి సలహాదారుగా కూడా ఉన్నారు. ఐక్యరాజ్యసమితి కోసం పనిచేశారు. భారతదేశ టెలికాం విప్లవానికి పితామహుడిగా పేరుపొందాడు.

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ ఘనంగా జరగడం.. ఇందులో డాక్టర్ జై గారు పాల్గొనడం.. ఆయన సేవలను శామ్ పిట్రోడా అభినందించడం విశేషం. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యమాలికను కింద చూడొచ్చు.

వీడియో కోసం ఈ యూట్యూబ్ షాట్ లో చూడొచ్చు.

TAGS