Jagan Political : జగన్ రాజకీయ కాలుష్యంలో బాధితులు ఎందరో

Jagan political

Jagan political

Jagan political Pollution : రాజకీయ పార్టీలకు అధికారం అనేది ఎన్నటికీ శాశ్వతం కాదు.గెలుపు ఓటమిలు సహజం.గెలిచినంత మాత్రాన ఓడిపోయినా పార్టీ నాయకులపై,కార్యకర్తలపై కక్షలు పెంచుకొని, కేసులు పెట్టడం,లేదంటే పార్టీ విడిచిపెట్టి అధికారంలో ఉన్న పార్టీలో చేరడానికి ఒత్తిడిచేయడం,చేరకపోతే అక్రమ కేసులు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది నేటి రాజకీయాల్లో.గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో కానీ, కాంగ్రెస్ హయాంలో కానీ యధావిధిగా రాజకీయాలని కొనసాగించినవి.తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీ ల చరిత్రనే మార్చివేశారు. వాటి ఉనికి లేకుండా చేసిన కేసీఆర్ పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైనది.

2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల పరిపాలనలో రాజకీయం అంటే ఏమిటో ప్రతిపక్షలకు రుచి చూపించింది.తెలుగుదేశం,జనసేన నాయకులకు,కార్యకర్తలకు రాజకీయ ఇబ్బందులు తప్పలేదు.ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడక తప్పలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా కక్ష తీర్చుకోవాలనే కసితో టీడీపీ,జనసేన నాయకులు ఆగిపోతున్నారు.రాజకీయ కసి అంటే ఎలా ఉంటుందో చెప్పింది కూడా జగన్ ఐదేళ్ల పరిపాలన కాబట్టి, వైసిపి నేతలు అంతకంతకు మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.

భారీ ఎత్తున ఎమ్మెల్యేలను గెలిపించుకొని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంత మేరకు అభివృద్ధి చేసిందో ఆ నేతలకు తెలుసు.రాబోయే రోజుల్లో కూడా తామే అధికారంలో ఉంటామనే గుడ్డి నమ్మకంతో జనసేన,టిడిపి శ్రేణులను కష్టాలు గురిచేసింది.అభివృద్ధి చేయకపోయినా, అనుకూలంగా లేనివారిపై మాత్రం కేసులు పెట్టడంలో అభివృద్ధి సాధించిందని చెప్పవచ్చు.  తెలంగాణలో నిత్యం అధికారం మాదే అనే నమ్మకంతో కేసీఆర్ ఓటమిపాలై ఇంటిముఖం పట్టడంతో నాయకులు కష్టాలను లెక్కపెట్టుకుంటున్నారు.ఇప్పడు తెలంగాణలో కూడా ఒకవేళ జగన్ ఇంటిముఖం పడితే ఆయనను నమ్ముకొని రాష్ట్రంలో చెలాయించిన నాయకుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్న.

ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలు జగన్ కు పట్టం కట్టారు. కానీ ఆయన అందుకు విరుద్దంగా ప్రవర్తించారు. రాజకీయ కక్షలకు పునాది వేశారు.అక్రమ కేసులకు తెరలేపారు.ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికే అధిక సమయం కేటాయించారు. రాజకీయంగా తనకు అనుకూలంగా ఉంటె ఒక తీరు, లేదంటే పోలీస్ కేసు,జైలు ఇది ఐదేళ్ల పరిపాలనలో ప్రతిపక్ష పార్టీలకి జగన్ ఇచ్చిన భారీ బహుమతి .

TAGS