Venuswamy : మెగా కుటుంబంలో మరో జంట విడిపోవడం ఖాయమట వేణుస్వామి బ్లాస్టింగ్ కామెంట్స్
Venuswamy : ప్రముఖ జ్యోతిష్య పండితుడు,సంచలనాలకు మారుపేరు అయినటువంటి వేణుస్వామి నిత్యం ఎవరివో ఒకరి జాతకాలు చెబుతారు.ఆయన చెప్పిందంటే అది పక్కా నిజమవుతుంది.అది సినీ రంగం వారి జాతకాలు కావచ్చు,రాజకీయ నాయకులవి కావచ్చు.లేదంటే ప్రముఖ పరిశ్రామిక వేత్తల జాతకాలైన కావచ్చు.ఆయన జాతకం చెప్పిందంటే సంచలనమే అవుతుంది.ఆయన చెప్పింది నిజం అవుతుంది కాబట్టి ఆయన ఇచ్చే సమయం కోసం వేచిచూసేవారి సంఖ్య రోజు,రోజుకు పెరిగిపోతోంది.ప్రముఖ అక్కినేని వారసుడు నాగచైతన్య, ఆయన భార్య సమంత విడిపోతారని గతంలో వారి జాతకం చూసి చెప్పడం జరిగింది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబలో జంట విడిపోతుందని వేణుస్వామి చెప్పి సంచలనం సృష్టించారు.
ఇటీవల వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఎప్పటిలాగే తన జ్యోతిష్యాన్ని వివరిస్తూనే నాగబాబు కుమారుడు,కోడలు వరుణ్ తేజ్,లావణ్యలు విడిపోవడం ఖాయమని స్పష్టంచేశారు.వీరిద్దరి జాతకాలు కుదరలేదన్నారు. జ్యోతిష్యం ప్రకారం వారిద్దరు కలిసి ఉండలేరన్నారు. కాపురం చేయడం కూడా నూటికి నూరు శాతం కష్టమేనని చెప్పారు. మనస్పర్థలు వచ్చి విడిపోవడం ఖాయమన్నారు. వరుణ్ తేజ్, లావణ్యల జాతక ప్రకారం వైవాహిక యోగం సరిగా లేదని చెప్పారు. పెళ్లి యోగం లేని ఆ ఇద్దరికీ పెళ్లి ముహూర్తం ఎలా పెట్టారోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరి వివాహం కావడమే గొప్ప విషయమని పేర్కొన్నారు.
తాను ఎవరికైనా జాతకం చెప్పాలంటే వారి జన్మ నక్షత్రం ప్రకారమే చెబుతానని, .వాళ్ల వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీయడానికి మాత్రం చెప్పను.కొద్దీ రోజులు అటుఇటు అయినా వరుణ్,లావణ్య విడిపోవడం తప్పదన్నారు. ఆ ఇద్దరి జాతక ప్రకారం ఎన్నటికయినా విడాకులు పొందడం తప్పదన్నారు. నటుడు చిరంజీవి కూతురు నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పారు వేణుస్వామి. అది నిజమైనది కూడా.
వేణుస్వామి చెప్పిన జాతకంతో మెగా అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.ఒకరి కుటుంబం గురుంచి కానీ, వాళ్ళ, వ్యక్తిగత విషయాల గురించి కానీ జాతకాల రూపంలో చెప్పే హక్కు వేణుస్వామి కి హక్కు ఎక్కడిది అని మెగా అభిమానులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.