Paralysis Treatment : పక్షవాతం వచ్చిన 24 గంటల్లో వస్తే..30 నిమిషాల్లో పరుగెత్తిస్తా..

Paralysis Treatment

Paralysis Treatment

Paralysis Treatment : ప్రస్తుత ఆధునిక కాలంలో ఎన్నో వైద్య సదుపాయాలు పెరిగినా రోగాలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. పక్షవాతం, కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్లు..ఇలా వయసుతో సంబంధం లేకుండా రోగాలు వస్తూనే ఉన్నాయి. జంక్ ఫుడ్ తో పాటు పర్యావరణ కాలుష్యం వంటి కారణాలతో ఈ రోగాలు ప్రబలుతున్నాయి. ఇక పక్షవాతం లాంటి రోగమైతే వెనకటి రోజుల్లో చాలా తక్కువగా వృద్ధుల్లో మాత్రమే కనపడేది. అయితే ప్రస్తుతం యువకులకు సైతం అటాక్ అవుతోంది.

పక్షవాతం వస్తే సాధారణంగా అల్లోపతి డాక్టర్లను సంప్రదిస్తారు. అక్కడా మంచి మందులే ఉన్నాయి. మంచి డైట్, మెడిసిన్స్, ఎక్సర్ సైజులతో పక్షవాతం నుంచి బయటపడవచ్చు. అయితే కొందరికి అల్లోపతి మందులు కూడా అంతగా పనిచేయవు. వీటిని సుదీర్ఘ కాలం వాడడం వల్ల ఇతర దుష్పరిణాలు వస్తాయి. దీంతో ఆయుర్వేదం వైపు కొందరు రోగులు మొగ్గుచూపుతారు.

ఆయుర్వేదం ద్వారా పక్షవాతాన్ని నిమిషాల్లో తగ్గిస్తామంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ ఆయుర్వేద డాక్టర్ పేరు మహమ్మద్ రఫీ షైక్. ఆయనకు హైదరాబాద్ దగ్గరలోని ఘట్ కేసర్ లో ‘సంపూర్ణ ఆయుర్వేద కేంద్రం’ అనే పక్షవాతం క్లినిక్ ఉంది. ఇందులో ఆయన పక్షవాతం రోగులకు ఆయుర్వేద చికిత్స అందిస్తారు. పక్షవాతం వచ్చిన 24 గంటల్లో తన దగ్గరకు వస్తే 30 నిమిషాల్లో పరుగెత్తిస్తా అని ఆయన భరోసా ఇస్తున్నారు.

ఏ వయసులో పక్షవాతం వచ్చిన రోగులకైనా తన ఆయుర్వేద మందులు, మసాజ్ లతో నయం చేస్తామని ఆయన ప్రకటిస్తున్నారు. సదరు సోషల్ మీడియా వీడియోలో ఆయన పక్షవాతంతో వచ్చిన ఓ పేషెంట్ ను నిమిషాల్లో నడిపించడం విశేషం. రోగికి నోటి ద్వారా ఓ పసరును అందించి కాసేపు మసాజ్ చేశారు. దీని తర్వాత పేషెంట్ ఎవరి సాయం లేకుండా నడిచాడు.

ఈ సందర్భంగా వైద్యుడు రఫీ షైక్ మాట్లాడుతూ..ఎలాంటి పక్షవాతం వచ్చిన తాను నయం చేస్తానన్నారు. రోగులకు ప్రతీ 15 రోజులకు ఒకసారి పసరు, మూడు నెలల పాటు మసాజ్ చేస్తామన్నారు. అయితే ఈ చికిత్స చేసినప్పుడు ఆహార నియమాలు పాటించాలన్నారు. చింత పండు పులుసు, బాయిలర్ చికెన్, గుడ్లు తినవద్దన్నారు. అలాగే వాత లక్షణాలు ఉండే దుంపలకు సైతం దూరంగా ఉండాలన్నారు. తమ ఆయుర్వేద కేంద్రంలో చికిత్స పొందాలనుకునే వారు ఫోన్ నంబర్లు  78930 81115, 78930 81113 లలో సంప్రదించవచ్చన్నారు.

కాగా, సోషల్ మీడియా, యూట్యూబ్ లో ప్రచారం ద్వారా రోగాలు నయం చేస్తామని చెప్పేవారిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వారి వైద్య విధానంపై వాకబు చేసి చికిత్స చేసుకోవాలన్నారు. ఏ వైద్య విధానమైన వంద శాతం సక్సెస్ రేట్ ఉండదనే విషయం తెలిసిందే.

TAGS