Kanna Lakshminarayana : ఉమ్మడి అభ్యర్థుల విజయం తథ్యం : మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
- కాశిపాడులో టీడీపీ కార్యాలయం ప్రారంభం
టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల విజయం తథ్యమని మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. 41 కాశిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మంగళవారం మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కలిసికట్టుగా ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, ఉమ్మడి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించేలా కృషి చేయాలని కోరారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయారని, ఎక్కడికి వెళ్లినా ప్రజాదరణను చూస్తే ఉమ్మడి అభ్యర్థుల విజయం తథ్యమని తెలుస్తోందన్నారు. అనంతరం బయ్యవరం, తమ్మవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులతో మాట్లాడారు.
టిడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.