Revanth Reddy : రాజకీయ చదరంగం ఆడుతున్న రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలు కత్తిమీది సాములా తయారయ్యాయి. ఈ ఎన్నికల్లో కనీసం 12 స్థానాల్లో అయినా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఏఏ స్థానాల్లో అయితే వెనుకబడి పోయిందో ఆ స్తనాలపై రేవంత్ రెడ్డి ప్రత్యేక ద్రుష్టి కేంద్రీకరించారు.నిజామాబాదు,మల్
నిజామాబాదు నుంచి జీవన్ రెడ్డి గెలుస్తున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డికి పదవి వచ్చే విదంగా నేను భాద్యతలు తీసుకుంటా. 2014, 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు పేరుతో కవిత,ధర్మపురు అరవింద్ గెలిచి నిజామాబాదు రైతులను మోసం చేసారు.కాబట్టి నిజామాబాదు రైతులు జీవం రెడ్డిని ఆశీర్వదించండి., మీకు పసుపు బోర్డు తెప్పించే భాద్యత నాది అంటూ రేవంత్ రెడ్డి హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిదంగా బోధన్ లో మూతపడిన చక్కెర కర్మాగారాన్ని సెప్టెంబర్ 17 లోగ తిరిగి ప్రారంభించడానికి భాద్యత తీసుకుంటున్న.ఈ విదంగా ఒకవైపు చక్కెర ఫ్యాక్టరీ,మరోవైపు పసుపు బోర్డు హామీతో ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం చేస్తూ ఓటర్లను రేవంత్ రెడ్డి ఆకట్టుకుంటున్నారు.
ఎమ్మెల్యే హోదాలో,మంత్రి హోదాలో పనిచేసిన ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో ఎందుకు ఓడిపోయాడు. అక్కడ అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు తిరస్కరించారు.కమ్యూనిస్టు భావాలున్న ఈటెల కాషాయం రంగు ఎందుకు పూసుకున్నాడు అంటూ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి సభలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పై విసురుతున్న అస్త్రాలకు ఈటెల రాజేందర్ ఆత్మ విమర్శలో పడిపోయాడని తెలుస్తోంది. తాను గెలిచిన మల్కాజిగిరి స్తానం ను ఎలాగయినా తిరిగి దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి అక్కడ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులతో ఈటలను ఇరకాటంలోకి నెట్టివేస్తున్నాయి.